రఘు హఠాన్మరణం
Raghu passed awayఫిలిం ఛాంబర్ లో పని చేసే రఘు హఠాన్మరణం అందరిని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈరోజు ఉదయం వాకింగ్ చేస్తూ రఘు హఠాత్తుగా గుండెనొప్పి వచ్చి పడిపోవడంతో ఇమ్మిడియట్ గా ఆసుపత్రికి తరలించినా అప్పటికే రఘు చనిపోయాడని డాక్టర్స్ నిర్దారించారు. అందరికి సుపరిచితుడైన రఘు సడన్ గా మరణించాడు అనే వార్త సినిమా ఇండస్ట్రీలో కలవరం సృష్టించింది.
ఫిలిం ఛాంబర్ లో అన్ని తానై ఛాంబర్ పనులన్నీ చక్కదిద్దే రఘు ఎన్నో సంవత్సరాలుగా ఫిలిం ఛాంబర్ లో విధులు నిర్వహిస్తున్నాడు. రఘు మరణంతో ఆయన కుటుంబానికి సినిమా ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
Raghu passed away
raghu
← BVS Ravi Goosebumps Words About Prabhas Entry In KannappaThe Roar Before the Farewell: Thalapathy Vijay's Jana Nayakudu First Glimpse Out Now →







































