Loading...

ఎమన్నా పట్టించుకోవద్దంటున్న సమంత

Samantha cryptic post created a buzz

ఒకప్పుడు ట్రోలింగ్ పై ఫైట్ చేసిన సమంత ఇప్పుడు ఎలాంటి మాటలు పట్టించుకోవద్దు అంటూ సలహాలిస్తుంది. నాగ చైతన్య తో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో సమంత పై జరిగిన ట్రోలింగ్ విషయంలో ఆమె లీగల్ గా ఫైట్ చేసింది . ఇప్పుడు మరోసారి సమంత పై రెండో పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చక్కర్లు కడుతున్నాయి. 

దర్శకుడు రాజ్ నిడమోరు ని సమంత వివాహం చేసుకోబోతుంది, ప్రస్తుతం వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలకు బలం చేకూరుస్తూ రాజ్ నిడమోరు వైఫ్ శ్యామలీ ఇండైరెక్ట్ పోస్ట్ లు పెడుతుంది. అయితే ఇవన్నీ చెవిని వేసుకున్న సమంత ఫిలాసఫీ మాట్లాడుతుంది. ఇతరులేమన్నా పట్టించుకోకుండా నిబ్బరంగా ఉండేందుకు ప్రయత్నం చెయ్యండి. ఏదోకటి జరగనీ అంటే మనకు మనశ్శాంతి రాదు, దానికోసం నిరంతర శ్రమ అవసరం. ప్రశాంతత ని ఆస్వాదించాలి కానీ, దానికోసం పోరాడొద్దు. 

నేను చెయ్యాల్సిందే కాదు, నేను తప్పకుండా చెయ్యాలి అనే భావన అలవర్చుకోవాలి. మనసు స్పీడుగా కాదు నిశ్చలత్వం, నిర్మలత్వంతో ప్రశాంతత దొరుకుతుంది. మనం పెట్టుకునే హద్దులు.. మన ఆత్మాభిమానంలో భాగమే, కానీ వాటి వలన గౌరవం తగ్గిపోకూడదు అంటూ సమంత చెప్పుకొచ్చింది. 

అది చూసి ఒకపుడు ఎలా ఉండే సమంత ఇప్పుడెలా మారింది అంటూ సమంత మెచ్యురిటికి నెటిజెన్స్ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. 

Samantha Ruth Prabhu shared a cryptic post

samantha