Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> No entry for KCR family members in Congress

కేసీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ లోకి నో ఎంట్రీ

No entry for KCR family members in Congress

కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి అస్సలే పడదు. ఓటుకు నోటు కేసులో జైల్లో పెట్టి బిడ్డ పెళ్ళికి కూడా వెళ్లకుండా ఇబ్బందులు పాలు చేసిన కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి కి ఎక్కడ లేని మంట. కేసీఆర్ కి కూడా రేవంత్ రెడ్డి అంటే కాస్త భయం ఉండబట్టే ఆయన్ని ఓటుకి నోటు కేసులో జైల్లో పెట్టించారనే మాట చాలామంది మాట్లాడుతూ ఉంటారు. 

ఇక రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన్ని ఫేస్ చెయ్యలేక కేసీఆర్ కాలు విరగ్గొట్టుకుని అసెంబ్లీకి రాలేదనే కామెంట్స్ కాదు కాదు మీమ్స్ కనిపించాయి. కొద్దిరోజులుగా కల్వకుంట్ల కవిత తండ్రి కేసీఆర్ పై యుద్ధం ప్రకటించి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది అనే ప్రచారం జరిగింది. కవిత తండ్రి కేసీఆర్ కి రాసిన లేఖ లీకవడం, ఆతర్వాత ఆరుగురు బీఆర్ ఎస్ ఎమ్యెల్యే లతో కాంగ్రెస్ లోకి వెళ్లబోతుంది అన్నారు. 

కానీ రేవంత్ రెడ్డి మాత్రం నేను కాంగ్రెస్ లో ఉన్నంతవరకు కేసీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ లోకి ఎంట్రీ లేదు అంటూ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను జీవించి ఉన్నంత వ‌ర‌కు కేసీఆర్ కుటుంబంలోని ఏ ఒక్క‌రికీ కూడా.. కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఉండ‌ద‌ని వ్యాఖ్యానించారు. 

అసలు తెలంగాణ‌కు శ‌త్రువులు అంటూ ఎవ‌రైనా ఉన్నారంటే.. అది కేసీఆర్ కుటుంబ‌మేన‌ని, రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబ‌మే ప్ర‌ధాన శ‌త్రువ‌ని అంటూ ఆయన కేసీఆర్ ఫ్యామిలీపై ఫైర్ అయ్యారు. 

CM Revanth Reddy: No place for KCR and his family in Congress

revanth reddy