ఎంగేజ్మెంట్ చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు
Avika Gor gets engagedచిన్నారి పెళ్లి కూతురుగా హిందీ నుంచి తెలుగు వరకు బుల్లితెర ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేసిన అవికా గోర్ ఆతర్వాత హిందీ సీరియల్స్ నుంచి టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఉయ్యాలా జంపాల చిత్రం తో హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అవికా గోర్ కి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఆమడ దూరంలోనే ఆగిపోయింది.
ప్రస్తుతం అవికా గోర్ వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వబోతుంది. అదే ఆమె పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యింది. కోరుకున్న వాడు, బాయ్ ఫ్రెండ్ మిలింద్ చంద్వానీతో నిశ్చితార్ధం చేసుకుని షాకివ్వడమే కాదు.. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అంతేకాదు తనకు కాబోయే వాడు ఎలా ప్రపోజ్ చేసాడో అనేది మిలింద్ చంద్వానీకి ముద్దులు పెడుతూ ఉన్న పిక్ తో రివీల్ చేసింది.
అతడు(మిలింద్ చంద్వానీ) ప్రపోజ్ చేసాడు, ముందుగా నువ్వే నా సమాధానం, తర్వాత ఎమోషనల్ అయ్యా, చివరికి నా ఆన్సర్ ఎస్ అంటూ అవికా గోర్ తన నిశ్చితార్ధపు ఫోటొస్ ని షేర్ చేసింది.
Avika Gor gets engaged to longtime boyfriend Milind Chandwani







































