ఫేక్ వ్యూస్ గాలి తీసేసిన దిల్ రాజు

Dil Raju Comments on Fake ViewsDil Raju Comments on Fake Views

ప్రొడ్యూసర్ దిల్ రాజు టాలీవుడ్ ఫేక్ వ్యూస్ గాలి తీసేసారు. అసలు విషయమేమిటీ అంటే కొన్నేళ్లుగా సినిమాలకు సంబందించిన  టీజర్, ట్రైలర్స్, గ్లింప్స్ ఏది విడుదలైనా.. మా సినిమా ట్రైలర్ కి ఇన్ని వ్యూస్ వచ్ఛాయి, మా సినిమా టీజర్ కి అన్ని వ్యూస్ వచ్చాయి. మా హీరో స్టామినా చూసారా, మీ హీరో కన్నా మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో అభిమానుల రచ్చకు కారణం యూట్యూబ్ వ్యూస్. 

అయితే ఆ వ్యూస్ జన్యూనా లేదంటే ఫేక్ అనేది పక్కనపెట్టి అభిమానులు తన్నుకు చావడం చూస్తున్నాము. ఇప్పుడు అదే విషయమై దిల్ రాజు తమ్ముడు ట్రైలర్ రిలీజ్ లో ఓపెన్ అయ్యారు. ట్రైలర్ వ్యూస్ కొనకండి, మిలియన్ వ్యూస్ అంటూ లక్షలు పెట్టి కొనకండి. అక్కడ నెంబర్స్ మాత్రమే కనిపిస్తుంది.

అలా బూస్ట్ చేయడం వల్ల ఆడియన్స్ కి రీచ్ అవుతుంది అనుకోవడం వేస్ట్, మా(తమ్ముడు) పి.ఆర్ టీమ్ కి వ్యూస్ అస్సలు కొనకండి అని చెప్పేసాను.. మా ట్రైలర్ వ్యూస్ ఒరిజినల్ వ్యూస్ అంటూ పి.ఆర్ స్టన్ట్స్ ని దిల్ రాజు ఓపెన్ చేసారు. అలాగే మీడియా వారిని ఉద్దేశించి మీరు Q/A లో ఇలాంటివి కదా అడగాల్సింది. ఫాల్స్ ని ఆపాలి,అదే చెయ్యండి అంటూ సలహా ఇచ్చారు. 

ఈ విషయంలో తను మొదటి స్టెప్ వేసాను అని, కష్టమైనా భరించాలి అంటూ ఆ విషయంలో తనకు మీడియా సపోర్ట్ కావాలన్నారు. అంతేకాదు కలెక్షన్స్ పోస్టర్స్ పై కూడా దిల్ రాజు రియాక్ట్ అయ్యారు. 

Dil Raju Exposes Fake Views System in the Industry

dil raju