బాలీవుడ్‌లో రష్మికకు మరో క్రేజీ ఆఫర్
Another crazy offer for Rashmika in Bollywoodరష్మిక మందన్న హవా బాలీవుడ్ లో అంతకంతకు పెరుగుతోంది. యానిమల్, చావా లాంటి బ్లాక్ బస్టర్లతో రష్మిక రేంజ్ స్కై ఈజ్ లిమిట్! అన్న చందంగా ఎదిగింది. ఒక్కో సినిమాకి రూ.4-5 కోట్ల పారితోషికం అందుకుంటున్న ఈ బ్యూటీ ఇటీవల రూ.6 కోట్ల రేంజులో పారితోషికాన్ని కోట్ చేస్తోందని తెలుస్తోంది.
అయినా రష్మికకు బాలీవుడ్ లో డిమాండ్ తగ్గలేదు. ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ ఫ్రాంఛైజీలో ప్రముఖ హీరోయిన్ లను రీప్లేస్ చేస్తోందని తెలిసింది. సైఫ్ ఖాన్- దీపిక- డయానా పెంటి తారాగణంగా హోమి అదజానియా రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ కాక్ టైల్ సీక్వెల్ లో రష్మిక మందన్న అవకాశం అందుకుందని తెలిసింది.
ఈ సీక్వెల్ చిత్రంలో షాహిద్- రష్మిక- కృతి సనోన్ లను ప్రధాన తారాగణంగా హోమి ఫిక్స్ చేసుకున్నారు. కాక్ టైల్ రొమాంటిక్ కామెడీ మూవీ. ఇందులో సైఫ్- దీపిక రొమాన్స్ ఒక రేంజులో వర్కవుటైంది. ఇప్పుడు అదే స్థాయిలో షాహిద్ తో కథానాయికల రొమాన్స్ వర్కవుట్ చేయాలని హోమి అదజానియా- దినేష్ విజన్- లవ్ రంజన్ (రచయిత) బృందం ప్లాన్ చేస్తోందని తెలిసింది. `కాక్‌టెయిల్ 2` వచ్చే ఏడాది చివరిలో విడుదల చేయాలనేది ప్లాన్. ఇండియా, యూరప్ లలో షూటింగ్ చేయనున్నారు.
Rashmika Mandanna reportedly star in Hindi crazy sequel







































