హరి హర వీరమల్లు ఎందుకీ జాప్యం

జూన్ 12 ఎన్ని రోజులుంది.. సరిగ్గా పది రోజులు మాత్రమే ఉంది. హరి హర వీరమల్లు రిలీజ్ సమయం ఆ పది రోజులే. ఇప్పటికీ సినిమా కి సంబందించిన ట్రైలర్ విషయం తేల్చడం లేదు, మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ హరి బరీగా జరుగుతుంది. ఇంకోపక్క హరి హర వీరమల్లు మర్కెట్ అవ్వక నిర్మాత ఏఎం రత్నం కంగారు పడుతున్నారు. ట్రైలర్ వస్తే మొత్తంగా మారిపోతుంది అంటున్నారు..
కానీ.. ఆ ట్రైలర్ డేట్ అనౌన్స్ చెయ్యడం లేదు. ఇంతవరకు వీరమల్లు నుంచి అందరూ షాకయ్యే కంటెంట్ వదల్లేదు, క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాక ఏఎం రత్నం ఎలాగోలా సినిమాని జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పూర్తి చేసారు, క్రిష్ ఉండిఉంటే వీరమల్లు క్రేజ్ మరోలా ఉండేది. మరోపక్క నాలుగున్నరేళ్ల స్క్రిప్ట్,. ఇప్పడు విడుదల అంటే ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు.
ప్రోపర్ ప్రమోషన్స్ లేవు, ఏఎం రత్నం కిందా మీదా పడి సినిమాని ఎలాగోలా వదిలించుకోవాలని, మరోపక్క హరి హర వీరమల్లు ఓటీటీ పార్ట్నర్ ఒత్తిడి తో జూన్ 12 రిలీజ్ అని అనౌన్స్ చేసారు. కానీ అందుకు తగ్గ పరిస్థితులు ప్రస్తుతం లేవు, వీరమల్లు టీమ్ మొత్తం రేయింబవళ్లు కష్టపడి పనులు పూర్తి చేస్తున్నారు.
ట్రైలర్ విషయంలో పవన్ ఫ్యాన్స్ లో అసహనం మొదలైపోయింది. హరి హర వీరమల్లు నుంచి ఆదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్ వదిలితేనే సినిమాపై క్రేజ్ వస్తుంది.. కానీ అలాంటిదేం జరగడం లేదు. చూద్దాం వీరమల్లు ఎలా బయటపడుతుందో అనేది.!
Hari Hara Veera Mallu Trailer Release Confusion Continues
Hari Hara Veera Mallu Theatrical: Big Confusion






































