ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Raja Saab Teaser and Release Date Locked

ఫైనల్లీ రాజా సాబ్ టీజర్ అండ్ రిలీజ్ డేట్ లాక్

Raja Saab Teaser and Release Date Locked

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం రాజా సాబ్ టీజర్ అలాగే రిలీజ్ తేదీపై నిన్నటివరకు ఎడతెగని సస్పెన్స్ నడిచింది. రాజా సాబ్ టీజర్ పై ఉత్కంఠ, రిలీజ్ డేట్ పై అభిమానుల్లో నిరాశ తాండవమాడింది. దర్శకుడు మారుతి రాజా సాబ్ ని చెక్కి చెక్కి చెక్కుతున్నాడో.. లేదంటే ప్రభాస్ డేట్స్ ఇవ్వట్లేదో తెలియదు కానీ.. రాజా సాబ్ షూటింగ్ మాత్రం పూర్తవ్వలేదు.  

దానితో రిలీజ్ తేదీ లేట్ అవడం, టీజర్ ఇవ్వకుండా ఆలస్యం చెయ్యడం ప్రభాస్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టింది. ఫైనల్లీ రాజా సాబ్ రిలీజ్ డేట్ ని, టీజర్ డేట్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఒకటికి నాలుగు డేట్స్ ని హోల్డ్ లో పెట్టుకుని చివరికి డిసెంబర్ 5 న రాజా సాబ్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 

గత రెండు నెలలుగా నలుగుతున్న రిలీజ్ డేట్ సస్పెన్స్ కు మేకర్స్ తెర దించారు. అంతేకాదు రాజా సాబ్ టీజర్ ను ఈ నెల 16  న వదులుతున్నట్టుగా చెప్పడమే కాదు దానికి టైమ్ ఫిక్స్ చేసారు. జూన్ 16 ఉదయం 10.52 కి రాజా సాబ్ టీజర్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. సో ఇకపై ఫ్యాన్స్ టెన్షన్ పడక్కర్లేదు. 

Finally Raja Saab Release Date Locked

raja saab