ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Harish Shankar shares update on Ustaad Bhagat Singh

పవన్ ఫ్యాన్స్ ను ఊపేస్తున్న ఉస్తాద్ అప్ డేట్

Harish Shankar shares update on Ustaad Bhagat Singh

నిన్నమొన్నటివరకు అసలు ఉంటుందో లేదో అనుకున్న సినిమా ఇప్పుడు సెట్ పైకి వెళుతుంది అంటే అభిమానులకు క్యూరియాసిటీ పెరిగిపోతుంది. అదే పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ ల ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసి OG సెట్ లోకి వెళ్లిపోయారు. OG కూడా సెప్టెంబర్ 25 న విడుదల కాబోతుంది. 

ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఈ నెల నుంచి రెస్యూమ్ షూట్ కి వెళ్లబోతుంది. దానితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. తాజాగా హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ పై సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఈ జూన్ రెండో వారం నుంచి మొదలు కాబోతుంది, నేను నా బెస్ట్ ఇవ్వడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాను అంటూ ఉస్తాద్ పై హరీష్ శంకర్ ఇచ్చిన అప్ డేట్ తో పవన్ ఫ్యాన్స్ లో ఉత్సాహం మొదలైంది. 

ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలీల కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం బల్క్ డేట్స్ కేటాయించేసిందట. సో ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కసారి సెట్ పైకి వెళితే నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరిపేలా హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నారట. 

I will deliver the best—Harish Shankar about Ustaad Bhagat Singh

ustaad bhagat singh