విశ్వంభర రిలీజ్ తేదికి అదే అడ్డంకి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగ్ కంప్లీట్ చేసారా.. చేస్తే దర్శకుడు వసిష్ఠ ఎందుకు విశ్వంభర రిలీజ్ తేదీని అనౌన్స్ చెయ్యడం లేదు, అసలు విశ్వంభర విషయంలో ఏం జరుగుతుంది అనేది అర్ధం కాక మెగా అభిమానులు తల పట్టుకుంటున్నారు. మరోపక్క చిరంజీవి అనిల్ రావిపూడి తో #Mega 57 షూటింగ్ లోకి వెళ్లిపోయారు.

# Mega157 షూటింగ్ విషయాలు రోజు వార్తల్లో ఉంటుంటే విశ్వంభర న్యూస్ కనిపించడం లేదు, దానితో మెగా అభిమానుల్లో అసహనం ఎక్కువవుతోంది. అయితే విశ్వంభర రిలీజ్ తేదీ ఇవ్వాలి అంటే విశ్వంభర సీజీ వర్క్ కంప్లీట్ అవ్వాలంట. ప్రస్తుతం దర్శకుడు వసిష్ఠ సీజీ పనుల్లో బిజీగా ఉన్నారట. అందుకే విశ్వంభర రిలీజ్ తేదీ ఇవ్వలేకపోతున్నట్టుగా తెలుస్తుంది. 

విశ్వంభర రిలీజ్ ఆగష్టు లో ఉంటుందా, లేదంటే దసరా బరిలో నిలుపుతారా, దసరా అంటే పవన్ కళ్యాణ్ OG ఉంటుంది, అప్పుడు కష్టం. మరి విశ్వంభర కు ఏ తేదీ లాక్ చేస్తారో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. 

Megastar Vishwambhara update

Vishwambhara release date update
vishwambhara