జూన్ మొత్తం పెద్ద సినిమాల జాతరే

గత మూడు నెలలుగా క్రేజీ సినిమాలేవీ లేక బాక్సాఫీసు బోర్ మంటుంది, ఆడియన్స్ అంతా పెద్ద సినిమాల కోసం ఎదురు చూసారు. కానీ వేసవి సెలవలన్నీ వృధాగా పోయాయి. సెలవలు పూర్తయ్యి స్కూల్స్ ఓపెన్ అయ్యే సమయంలో సినిమాల జాతర మొదలైంది. జూన్ స్టార్ట్ అయ్యింది.. సినిమాల విడుదల మొదలయ్యింది.
జూన్ 5 నుంచి మొదలైన సినిమా జాతర ఈ నెల ఎండ్ వరకు వారం వారం కొనసాగుతుంది. జూన్ 5 న పాన్ ఇండియా మూవీ గా కమల్ హాసన్ - మణిరత్నం కాంబోలో శింబు కీలక పాత్రలో తెరకెక్కిన థగ్ లైఫ్ విడుదల కాబోతుంది. గత నెల రోజులుగా థగ్ లైఫ్ ప్రమోషన్స్ జోరుగా చూపించారు, సినిమాపైన మంచి హైప్ ఉంది. దాని తర్వాత మరో వారానికే పవన్ వచ్చేస్తున్నారు.
జూన్ 12 న హరి హర వీరమల్లు తో పవన్ కళ్యాణ్ వస్తున్నారు. అంటే మరో పది రోజుల్లో పవన్ కళ్యాణ్ వీరమల్లు వస్తుంది. ప్రమోషన్స్ పరంగా వీక్ అయినా.. పవన్ కళ్యాణ్ క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరమల్లు ని బయట పడేస్తుంది.. కానీ పాన్ ఇండియా అంటే కష్టమే. ఇక పవన్ కళ్యాణ్ వచ్చిన వారానికి జూన్ 20 నాగార్జున-ధనుష్-కుబేర వస్తుంది, దానితో పాటుగా 8 వసంతాలు విడుదల కాబోతుంది. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రాబోతుంది.
ఇక కుబేర వచ్చిన వారానికి మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 27 న విడుదలకు సిద్దమవుతుంది. జూన్ మొత్తం కొత్తకొత్త భారీ సినిమాలతో బాక్సాఫీసు కళకళలాడిపోతుంది.
June 2025 Big Movies Set To Hit Theaters This Month
The whole of June is a big movie festival







































