ఒక్క సినిమా ముగ్గురిని ఒడ్డున పడేసింది.
Manchu Manoj, Bellamkonda and Nara Rohith make a decent comebackఒక్క సినిమా ముగ్గురు హీరోలకు పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ అవుతుందా అని ఎదురు చూసిన వాళ్లకు కరెక్ట్ సమాధానము చెప్పింది భైరవం.. ముగ్గురు హీరోలను ఒక్క సినిమా ఒడ్డున పడేసింది. అదే విజయ్ కనకమేడల తెరకెక్కించిన భైరవం. మే 30 శుక్రవారం విడుదలైన భైరవం చిత్రానికి చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ రావడం, క్రిటిక్స్ మంచి రివ్యూస్ ఇవ్వడం, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడం భైరవం చిత్రానికి కలిసొచ్చేలా ఉంది.
ముగ్గురు హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు పాత్రలను విజయ్ కనకమేడల డిజైన్ చేసిన తీరు మాస్ ఆడియన్స్ కు బాగా నచ్చింది. శ్రీనివాస్ శ్రీను కేరెక్టర్, మంచు మనోజ్ గజపతి వర్మ కేరెక్టర్, నారా రోహిత్ పాత్ర అందులోని ఇంటెన్సిటీ అన్ని ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.
తొమ్మిదేళ్ళ తర్వాత కం బ్యాక్ అయిన మంచు మనోజ్ కి, ఛత్రపతి రీమేక్ తో డిజప్పాయింట్ అయిన శ్రీనివాస్ కి, సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న నారా రోహిత్ కి భైరవం చిత్రం పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ అయ్యింది. మంచు మనోజ్ చాలా రోజుల తర్వాత తన పెరఫార్మెన్స్ తో అద్దరగొట్టేయగా, బెల్లంకొండ శ్రీనివాస్ డిఫరెంట్ కేరెక్టర్ లో ఆకట్టుకున్నాడు, నారా రోహిత్ పాత్ర హుందాగా కనిపించింది. ముగ్గురు హీరోలను ఒకే ఒక్క సినిమా భైరవం ఒడ్డున పడేసింది అంటూ ఆ హీరోల అభిమానులే కాదు నెటిజెన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు.
Bhairavam - Manchu Manoj, Bellamkonda Srinivas and Nara Rohith make a decent comeback







































