Advertisement

వంగాతో పెట్టుకుంటే స్త్రీ వాదం ఖ‌తం

20 కోట్ల పారితోషికం, లాభాల్లో వాటా అడిగినందున దీపిక ప‌దుకొనే `స్పిరిట్` నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి వ‌చ్చిందా?  ఇది స‌రైన కార‌ణమేనా? అంటే కానే కాదు. పాన్ ఇండియా ట్రెండ్ లో అస‌లు పారితోషికం స‌మ‌స్య కాదు. ఒక‌రితో ఒక‌రికి సింక్ కుద‌ర‌క‌పోతేనే స‌మ‌స్య‌. ఈగోల‌కు వెళితే అది మ‌రింత‌ పెద్ద‌ది అవుతుంది. ఇప్పుడు దీపిక‌, సందీప్ వంగా మ‌ధ్య అలాంటి ఈగో గొడ‌వే త‌లెత్తింద‌ని విశ్లేషిస్తున్నారు.

ముఖ్యంగా దీపిక ప‌దుకొనేలో హ‌ద్దు మీరిన `ఫెమినిజం` పెను స‌మ‌స్య‌గా మారింది. నేను త‌గ్గేదేలే! అంటూ భీష్మించుకుని కూచుంది దీపిక. దీంతో సందీప్ వంగా దానిని స‌హించ‌లేక‌పోయాడు. పైగా ట్రిప్తి దిమ్రీని ఎంపిక చేసుకున్న తర‌వాత అయినా, హుందాగా ఉండాల్సిన దీపిక స్పిరిట్ స్టోరీపై లీకులివ్వ‌డం కూడా కాలిపోయేలా చేసింది. దీపిక ఫెమినిజాన్ని, ద్వంద్వ వైఖ‌రిని సందీప్ వంగా తూర్పార‌బ‌ట్టాడు. చెత్త పీఆర్ స్టంట్ ని కూడా తీవ్రంగా తిట్టాడు.

ఇప్ప‌టివ‌ర‌కూ సందీప్ వంగా తెర‌కెక్కించిన సినిమాల‌ను ప‌రిశీలిస్తే, అత‌డు స్త్రీ పాత్ర‌కు ఎంతో ప్రాధాన్య‌త‌నిచ్చాడ‌ని అర్థ‌మ‌వుతుంది. అర్జున్ రెడ్డిలో షాలిని పాండే, యానిమ‌ల్ లో ర‌ష్మిక పాత్ర‌ల‌ను అత‌డు బ‌లంగా ప్రెజెంట్ చేసాడు. దీని అర్థం అత‌డు స్త్రీని గౌర‌విస్తాడ‌నే. కానీ ఈగోల‌కు వెళితే, ఫెమినిజం హ‌ద్దు మీరితే స‌హించ‌లేడ‌ని దీపిక ఎపిసోడ్ నిరూపించింది. బిడ్డ‌తో ఎనిమిది గంట‌ల స‌మ‌యం ఇబ్బంది అవుతుంది.. ఆరు గంట‌లే ప‌ని చేసేలా అనుమ‌తివ్వండి అని అభ్య‌ర్థించి ఉంటే సందీప్ వంగా క‌రుణించేవాడేమో! కానీ దీపిక ఫెమినిస్టు భావ‌జాలాన్ని రుద్దేందుకు ప్ర‌య‌త్నించ‌డం సందీప్ ఆగ్రహానికి కార‌ణ‌మైంది.

సందీప్ వంగా త‌న హీరోల ద్వారా పురుషాధిప‌త్యాన్ని కూడా ప్ర‌ద‌ర్శించాడు. ర‌ఫ్ అండ్ ఠ‌ఫ్ గా ఉంటాన‌ని చెప్ప‌క‌నే చెప్పాడు. అత‌డి గ‌ట్సీ ఎంపిక‌లు కూడా అలానే ఉన్నాయి. దీపిక ఎగ్జిట్ అవ్వ‌గానే ట్రిప్తి దిమ్రీని మ‌రో ఆలోచ‌న లేకుండా ఆ పాత్ర‌కు ఎంపిక చేసి అంద‌రికీ షాకిచ్చాడు. వంగాతో పెట్టుకుంటే స్త్రీవాదం ఖ‌త‌మైన‌ట్టే. కానీ ట్రోల‌ర్లు అత‌డి వైఖ‌రిని ఎప్ప‌టికీ త‌ప్పు ప‌ట్ట‌డం ఇక‌పైనా చూస్తుంటాం.

Sandeep Reddy Vanga vs Deepika Padukone

Sandeep Vanga vs Deepika Padukone
deepika