ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Manchu Vishnu Approaches Supreme Court

సుప్రీం కోర్టు కు మంచు హీరో

Manchu Vishnu Approaches Supreme Court

కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్ విషయంలో సఫర్ అవుతున్న మంచు విష్ణు తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ అయ్యింది. కారణం ఏమిటంటే 2019 సాధారణ ఎన్నికల సందర్భంగా మంచు విష్ణు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో విష్ణు పై అప్పట్లో కేసు నమోదైంది.   

అప్పుడు నమోదు అయిన ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు మంచు విష్ణు. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో తదుపరి విచారణను జులై 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.

ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. కన్నప్ప కు సంబందించిన కీలక హార్డ్ డిస్క్ మిస్ అవడం, దానిపై కేసు నమోదు కావడం చూసారు. ఈ పరిస్థితుల్లో కన్నప్ప జూన్ 27 న విడుదలవుతుందా అనే విషయంలో ప్రస్తుతం సస్పెన్స్ నడుస్తుంది. 

Manchu Vishnu Approach Supreme Court over Code Violation Case on Him

manchu vishnu