ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్
Jr NTR, Kalyan Ram pay tribute to NTRమే 28 ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నందమమూరి ఫ్యామిలీ మెంబెర్స్ తో పాటుగా అభిమానులు నివాళులర్పిస్తున్నారు. ప్రతి ఏడాది హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి తాతగారికి నివాళులు అర్పించే జూనియర్ ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ ఈ రోజు బుధవారం ఉదయమే ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లారు.
అక్కడ తాతగారి సమాధి వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి తాతగారికి నివాళులు అర్పించి.. కాసేపు మౌనం పాటించి తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా.. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది. మీరు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రి ని ఈ గుండెని మరొక్కసారి తాకి పో తాతా అంటూ ఆయన తన తాతగారిని స్మరించుకున్నారు.
Jr NTR, Kalyan Ram pay tribute to NTR on birth anniversary
ntr






































