మహేష్ - రాజమౌళిని వదిలేసి పీసీ షికార్లు
Priyanka Chopra serves breezy Italian vacationసూపర్‌స్టార్ మహేష్ సరసన ఎస్.ఎస్.ఎం.బి 29లో నటిస్తోంది ప్రియాంక చోప్రా. గ్లోబల్ ఐకన్ గా ఓ వెలుగు వెలుగుతున్న పీసీ, ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ చిత్రీకరణలోను పాల్గొంది. రాజమౌళి ప్రణాళికాబద్ధంగా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో షెడ్యూళ్లకు కొంత బ్రేక్ రాగానే, ప్రియాంక చోప్రా విదేశాల్లో వాలిపోయింది. అక్కడ తన భర్త నిక్ జోనాస్ తో కలిసి బోలెడంత సందడి చేస్తోంది. తాజాగా నిక్ జోనాస్ సోదరుడు జో జోనాస్ సింగింగ్ ఆల్బమ్ `ది జో` లోంచి ఒక పాటను విడుదల చేయగా, ఈవెంట్లో భర్తతో కలిసి ప్రియాంక చోప్రా సందడి చేయడం ఆసక్తిని కలిగించింది. నిక్ తన సోదరుడి వద్దకు ప్రియాంక చోప్రా చేతిని పట్టుకుని నడిపిస్తూ వస్తున్నాడు. ఈ వీడియో ఎంతో క్యూట్ గా కనిపించింది. ప్రస్తుతం దీనిని అభిమానులు అంతర్జాలంలో వైరల్ చేస్తున్నారు.
ఇక జో జోనాస్ ప్రస్తుతం అరబిక్ టాక్ షోతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ షోలో పాల్గొనేందుకు, తన మరిది జో జోనాస్ ని ప్రోత్సహించేందుకు పీసీ చాలా ఉత్సాహం ప్రదర్శించింది. జో ప్రతిభకు నిక్ జోనాస్ సైతం ఎంతో ఉద్విగ్నతకు గురయ్యాడు. జోజోనాస్ గత ఏడాది తన భార్య సోఫీ టర్నర్ నుంచి వివాదాల కారణంగా బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే.
Priyanka Chopra enjoyed a trip to Taormina






































