బాలయ్య బ్రేకిచ్చారు.. సంక్రాంతి ఓకేనా..

Balayya to take a break from NBK109

నందమూరి నటసింహ బాలకృష్ణ NBK 109 షూటింగ్ పూర్తి చేసారా.. అసలే నాగవంశీ సంక్రాంతికి రిలీజ్ అనే పట్టుదలతో కనిపిస్తున్నారు. రేపు కార్తీక పౌర్ణమి శుక్రవారం నవంబర్ 15 న NBK 109 నుంచి టైటిల్ టీజర్ రాబోతుంది. బాబీ దర్శకత్వంలో పవర్ ఫుల్ బాలయ్య గా ఆడియన్స్ ముందుకు వచ్చెందుకు రెడీ అవుతున్నారు. అయితే ప్రస్తుతం బాలయ్య NBK 109 కి చిన్న బ్రేక్ఇ చ్చారు.

ఆయన అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. హిందూపూర్ హ్యాట్రిక్ ఎమ్యెల్యేగా గెలిచిన బాలయ్య అసెంబ్లీ సమావేశాల కోసం షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడంతో.. ఏమిటి సినిమా సంక్రాంతికి రిలీజ్ అన్నారు, బాలయ్య బ్రేకిచ్చినా పర్లేదా.. సంక్రాంతికి ఓకేనా అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అసలే జనవరి 10 అదే సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రాబోతుంది.

అందుకే మెగా ఫ్యాన్స్ బాలయ్య NBK 109 పై ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారు. అయితే షూటింగ్ ఆల్మోస్ట్ ఓ కొలిక్కి వచ్చేసింది, బాలయ్య లేకున్నా బాబీ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి సినిమా ఉంటుంది అంటూ నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

Nandamuri Balakrishna At AP Assembly

nandamuri balakrishna