ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Prasanth Varma New Post Ignites Speculation

హనుమాన్ చిన్నదే.. జై హనుమాన్ మాత్రం..

Prasanth Varma New Post Ignites Speculation

ప్రశాంత్ వర్మ కుర్ర హీరో తేజ సజ్జ తో తెరకెక్కించిన హనుమాన్ విడుదలకు ముందు చాలా చిన్న సినిమా. పెద్ద హీరో లేడు, స్టార్ డైరెక్టర్ కాదు, అందుకే చిన్న సినిమా అనుకున్నారు. కానీ విడుదలయ్యాక హనుమాన్ కలెక్షన్స్ చూసి పెద్ద స్టార్స్ తెల్లబోయారు. ప్రశాంత్ వర్మ హనుమాన్ తో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. 

ఇక హనుమాన్ ని చిన్నగా ప్రేక్షకుల్లోకి తీసుకొచ్చిన ప్రశాంత్ వర్మ హనుమాన్ కి సీక్వెల్ గా ఎనౌన్స్ చేసిన జై హనుమాన్ ను మాత్రం పెద్దగా తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే కన్నడ కాంతార రిషబ్ శెట్టి ని హనుమాన్ కేరెక్టర్ కి ఒప్పించడమే మాములు విషయం కాదు అంటే.. ఇప్పుడు బాహుబలిలో భళ్లాలదేవుడిగా ప్రపంచం మెచ్చిన రానాను తన జై హనుమాన్ లో భాగం చెయ్యడం మరింత విశేషంగా మారింది. 

తాజాగా ప్రశాంత్ వర్మ జై జై హనుమాన్ అంటూ రానాతో, రిషబ్ శెట్టి తో ఉన్న పిక్ షేర్ చెయ్యగానే అది నెట్టింట సంచలనంగా మారిపోవడమే కాదు.. ఈసారి జై హనుమాన్ తో ప్రశాంత్ వర్మ స్టార్ క్యాస్ట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి రానా జై హనుమాన్ లో ఉన్నదా, లేదా అనేది పక్కన పెడితే.. జై హనుమాన్ లో రానా చెయ్యబోయే రోల్ పై అందరిలో అంచనాలు మాత్రం పెరిగిపోతున్నాయి. 

Is Rana A Part Of Prasanth Varma, Rishab Shetty Jai Hanuman?

rana