మహేష్ తో సినిమా: నాగొయ్యి నేనే తీసుకున్నా

ఢీ, రెడీ, దూకుడు చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టి టాప్ దర్శకుల జాబితాలో స్థానం సంపాదించుకున్న శ్రీను వైట్ల ఆగడు చిత్రంతో చాలా ఏళ్ళు ఎవరికీ కనిపించకుండా పోయాడు. ఆగడు తర్వాత ఒకటిరెండు సినిమాలు చేసినా శ్రీను వైట్ల ను ఏవి ఆదుకోలేకపోయాయి. కెరీర్ లోనే కాదు ఆతర్వాత ఆయన పర్సనల్ లైఫ్ లోను ఇబ్బందులు పడ్డాడు. భార్యతో గొడవలు, డివోర్స్ అన్ని శ్రీని వైట్లని డౌన్ చేసాయి.
తాజాగా శ్రీను వైట్ల గోపీచంద్ తో చేసిన చిత్రం విశ్వం విడుదలకు సిద్ధమవుతుండగా.. ఆ సినిమా ప్రమోషన్స్ లో శ్రీను వైట్ల చాలా విషయాలు మీడియాతో షేర్ చేస్తున్నాడు. తాను రియల్ ఎస్టేట్ పై ఫోకస్ పెట్టి సినిమాలు పట్టించుకోలేదు, వాస్తుపై నమ్మకం ఉంచి ఇల్లు మారాడు అంటూ చాలా రకాల ప్రచారాలు జరిగాయి. కానీ నేను వాస్తును నమ్మను, రియల్ ఎస్టేట్ పిచ్చ లేదు, నాకు వేల కోట్లు అంతకన్నా లేవు అంటూ చెప్పిన శ్రీను వైట్ల మహేష్ తో సినిమా చేసి నా గొయ్యి నేనే తవ్వుకున్నాను అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.
నేను కెరీర్ లో పొరపాటు చేసాను అంటే అది ఆగడు సినిమానే. మహేష్ తో ముందు చేద్దామనుకున్న కథ వేరు, ఆ తర్వాత అంత భారీ కథ నిర్మాతలకు భారమవుతోంది అని భావించి, వేరే కథను చూజ్ చేసుకున్నాం. ఈ సినిమా కోసం కూడా అదే స్థాయిలో కష్టపడ్డాము. కానీ దూకుడు హిట్ తరువాత పెరిగిన అంచనాలు అందుకోవడంలో ఆగడు ఫెయిల్ అయ్యింది.
ఆగడు చిత్రం నాకు నేనుగా తీసుకున్న గొయ్యి అంటూ శ్రీను వైట్ల ఆగడు విషయంలో చేసిన పొరపాటును ఇన్నాళ్లకు బయటపెట్టాడు.
Thats The Reason For Aagadu Failure: Sreenu Vaitla
Movie with Mahesh: Srinu Vaitla Sensational comments







































