ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజెస్

గత వారం లాగే ఈ వారం కూడా చిన్న చిత్రాలే బాక్సాఫీసు దగ్గరకు వస్తున్నాయి. ఈ నెల 27 న దేవర రాకతో చాలా చిత్రాలు కామ్ గా ఉన్నాయి. కానీ చిన్న చిత్రాలు మాత్రం బాక్సాఫీసు దగ్గర సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. ఈ వారం కూడా చిన్న చిత్రాలు వాటితో పాటుగా రెండు రీ రిలీజ్ లు కూడా ఉన్నాయి. సుహాస్ గొర్రె పురాణం, యుద్ర, బొమ్మరిల్లు (రీ రిలీజ్), జర్నీ (రీ రిలీజ్) లు థియేటర్స్ లోకి వస్తున్నాయి.  

వాటితో పాటుగా ఓటీటీలలోను ఇంట్రెస్టింగ్ చిత్రాలు, వెబ్ సీరీస్ లు ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

ఆహా :

మారుతి నగర్ సుబ్రహ్మణ్యం (తెలుగు) సెప్టెంబర్ 20

డిస్నీ+హాట్‌స్టార్‌ :

అన్‌ ప్రిజన్డ్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 16

ది మిస్టరీ ఆఫ్‌ మోక్ష ఐల్యాండ్‌ (తెలుగు) సెప్టెంబరు 20

నెట్‌ఫ్లిక్స్‌ :

తంగలాన్ (తెలుగు, తమిళ)సెప్టెంబర్ 20

గ్రేవ్‌ టార్చర్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 16

ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో2 (టాక్‌ షో) సెప్టెంబరు 21

ఈవిల్‌ డెడ్ రైజ్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 21

జియో సినిమా :

దుర్గ (హిందీ) సెప్టెంబరు 16

జీ తేరా హై వో మేరా హై (హిందీ) సెప్టెంబరు 20 

This Week OTT Releases

Theater and OTT releases this week
movies