నితిన్ వారసుడొచ్చేసాడు

Hero Nithiin blessed with baby

యంగ్ హీరో నితిన్ తండ్రయ్యాడు. నితిన్-షాలిని తల్లితండ్రులుగా ప్రమోట్ అయ్యారు. కరోనా సమయంలో షాలిని ని సింపుల్ గా ఇరు కుటుంబ సభ్యుల నడుమ వివాహం చేసుకున్న నితిన్ ఇప్పుడు వారసుడిని ఎత్తుకున్నాడు. షాలిని ప్రెగ్నెన్సీ విషయం రీసెంట్ గానే రివీల్ అయ్యింది. 

తాజాగా షాలిని డెలివరీ అవడం, పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడంతో.. నితిన్ కి వారసుడొచ్చేసాడంటూ ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. నితిన్ తాను తండ్రి అయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన కొడుకు చేతిని, తన చేతిని, భార్య షాలిని చేతిని ఉన్న పిక్ షేర్ చేస్తూ తాను తండ్రిగా ప్రమోట్ అయిన విషయాన్ని రివీల్ చేసాడు. 

నితిన్-షాలినీ లకు మగ బిడ్డ పుట్టిన విషయం తెలిసి ఆయన స్నేహితులు, సన్నిహితులు అందరూ నితిన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Nithiin and Shalini blessed with a Baby Boy

nithiin