ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nagarjuna planning another multistarrer ?

మల్టీస్టారర్ మోజు లో నాగార్జున

Nagarjuna planning another multistarrer ?

కింగ్ నాగార్జున కొద్దిరోజులుగా మల్టీస్టారర్లు మీద మోజు చూపించేలా ఆయన ప్రాజెక్ట్స్ ఎంపిక కనిపిస్తుంది. రెండేళ్ల క్రితం బాలీవుడ్ బ్రహ్మాస్త్ర చేసిన నాగార్జున ఆ తర్వాత నా సామీ రంగా అంటూ అల్లరి నరేష్-రాజ్ తరుణ్ లతో సినిమా చేసారు. ఇక ఇప్పుడు ధనుష్ కలయికలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే మల్టీస్టారర్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ లో నాగార్జున జాయిన్ అయ్యారు. కుబేర మూవీలో నాగార్జున ప‌వ‌ర్ ఫుల్ ఈడీ అధికారి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది.

ఆ తర్వాత నాగార్జున టాలీవుడ్ లో చెయ్యబోయే చిత్రంపై అందరిలో ఆసక్తి మొదలయ్యింది. త‌మిళ ద‌ర్శ‌కుడు న‌వీన్ అనే కొత్త కుర్రాడితో నాగార్జున తన తదుపరి సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో నాగార్జున సోలో హీరోగా కనిపిస్తారని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్నికూడా నాగార్జున మరో హీరోతో కలిసి చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. జ్ఞాన్ వేల్ రాజా నిర్మిస్తున్న సినిమా జులై నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని స‌మాచారం. 

అయితే ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో నటిస్తారని, నాగార్జున మరో స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని అంటున్నారు. ఇదొక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ చిత్ర‌మ‌ని స‌మాచారం. దీంతో పేరున్న హీరోనే నాగార్జున చిత్రంలో న‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Exciting News about Nagarjuna Upcoming Project

nagarjuna