ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Hanuman OTT Release Date suspense continue

హనుమాన్ ఓటిటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

Hanuman OTT Release Date suspense continue

సంక్రాంతి సినిమాలన్ని ఓటిటిల్లోకి వచ్చేశాయి. వాటి సందడి సద్దుమణిగింది. కానీ సంక్రాంతికి పెద్ద హిట్ గా నిలిచిన హనుమాన్ మాత్రం ఇంతవరకు ఓటిటి డేట్ లాక్ చెయ్యకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇంకా ఇంకా వెయిట్ చేయిస్తూనే ఉన్నారు మేకర్స్. హనుమాన్ ఓటిటి హక్కులని దక్కించుకున్న జీ 5 హనుమాన్ ని ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేస్తుందా అని చాలామంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. హనుమాన్ థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ ముగిసిపోయిది.

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కూడా హనుమాన్ మ్యానియా నుంచి బయటికొస్తున్నారు. ప్రశాంత్ వర్మ తదుపరి హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ పనులు మొదలు పెట్టేసాడు. అటు తేజ సజ్జ నెక్స్ట్ మూవీ కోసం ఫోటో షూట్స్ వదులుతున్నాడు. మరి ఇంత జరుగుతున్నా హనుమాన్ ఓటిటి రిలీజ్ ఎప్పుడో చెప్పడం లేదు. మార్చ్ 2 నుంచి హనుమాన్ ఓటిటిలో కనిపిస్తుంది అని ప్రచారం జరిగింది.. కానీ ఇప్పుడు హనుమాన్ ఓటిటీ రిలీజ్ పై సూపర్ క్లారిటీ వచ్చేసింది..

హనుమాన్ మార్చ్ 8 నుంచి ఓటిటీ అభిమానుల ముందుకు రాబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసారు. అంటే వచ్చే శుక్రవారం నుంచి హనుమాన్ చిత్రం జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. గెట్ రెడీ ఓటిటీ ఫాన్స్.

Hanuman May Land On OTT On This Date

hanuman