ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Prashanth Neel Wife Update on Salaar Trailer

Salaar: నీల్ వైఫ్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో క్రేజీ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌గా తెరకెక్కిన సలార్ రిలీజ్‌కి సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో, పాన్ ఇండియా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోతుంది. డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ అంటూ మేకర్స్ ఇచ్చిన అప్‌డేట్‌తో అభిమానులు తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ప్రస్తుతం సలార్‌పై ఉన్న అంచనాలు ఆకాశంలో కనిపిస్తున్నాయి. రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు కూడా సలార్‌తో ఆకలి తీర్చుకోవాలని వెయిట్ చేస్తున్నారు.

ఇక డిసెంబర్ 1న రాబోయే ట్రైలర్ వార్తతో గత వారం రోజులుగా సలార్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తాజాగా ప్రశాంత్ నీల్ వైఫ్ సలార్ ట్రైలర్‌పై ఇచ్చిన అప్‌డేట్‌తో సోషల్ మీడియా షేకవుతుంది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఇలా రాసుకొచ్చారు. ప్రస్తుతం సలార్ ట్రైలర్‌కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి అంటూ.. అది కూడా రవిబస్రూర్ స్టూడియో నుంచే అని పిక్‌తో కన్ఫామ్ చేసింది. ఈ అప్‌డేట్ తో ఫ్యాన్స్‌లో ఊపొచ్చేసింది. ఇప్పటివరకు సలార్ అప్‌డేట్స్ విషయంలో డిజప్పాయింట్ మోడ్‌లో ఉన్న అభిమానులు ఇలాంటి చిన్న చిన్న అప్‌డేట్స్‌కి కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు మేకర్స్ కూడా సలార్ డిస్ట్రిబ్యూటర్ల వివరాలను వినూత్నంగా తెలియజేస్తూ.. నిత్యం సినిమాని వార్తలో ఉంచేలా చేస్తున్నారు.

Salaar Trailer Latest Update Creates Sensation

Prashanth Neel Wife Update on Salaar Trailer
salaar