వరుణ్, లావణ్యల ఎంగేజ్‌మెంట్ పిక్
Official Confirmation From Varun Tej About His Loveమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, క్యూట్ బ్యూటీ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం ఫ్యామిలీ మెంబర్స్, దగ్గర బంధువుల సమక్షంలో గ్రాండ్‌గా ముగిసింది. ఈ నిశ్చితార్థపు వేడుకకు ఇండస్ట్రీలోని వారికి, మీడియా వారికి కూడా ఆహ్వానం లేదు. కేవలం మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ మెంబర్స్, ఇరు ఫ్యామిలీలకు చెందిన దగ్గరి బంధువులు.. ఇంకా వరుణ్, లావణ్యల పర్సనల్ డిజైనర్స్ మాత్రమే హాజరయ్యారు.
నిశ్చితార్థం అనంతరం వరుణ్ తేజ్ ట్విట్టర్ వేదికగా.. లావణ్య త్రిపాఠితో జరిగిన ఎంగేజ్‌మెంట్ ఫిక్స్‌ని షేర్ చేశారు. వాస్తవంగా చెప్పాలంటే.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమకు సంబంధించి అధికారికంగా బయటకు వచ్చిన మొట్టమొదటి పిక్స్ ఇవేనని చెప్పుకోవాలి. ఎందుకంటే.. గత కొంత కాలంగా వారి ప్రేమ వ్యవహారంపై, అలాగే తాజాగా జరిగిన నిశ్చితార్థంపై వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ.. అటు మెగా ఫ్యామిలీ మెంబర్స్‌గానీ, ఇటు లావణ్య కుటుంబ సభ్యులు కానీ ఎవరూ రియాక్ట్ కాలేదు.
మధ్యలో మెగాబ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో.. వరుణ్ ప్రేమకు సంబంధించి తనే స్వయంగా వెల్లడిస్తాడని తెలిపారు కానీ.. ఆయన కూడా ఏం మాట్లాడలేదు. ఇలా రూమర్స్ వైరల్ అవుతున్న సమయంలోనే రెండు రోజుల్లో నిశ్చితార్థం అంటూ ఓ కార్డ్ బయటికి వచ్చింది. ఆ కార్డ్‌ని కూడా వారు అధికారికంగా విడుదల చేయలేదు. ఇప్పుడు కామ్‌గా నిశ్చితార్థం ముగించేశారు. పెళ్లి ఎప్పుడు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే అనౌన్స్ చేస్తారట. ఇక ఈ నిశ్చితార్థంలో వరుణ్, లావణ్యలు చాలా సాంప్రదాయంగా, సింపుల్‌గా కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Varun Tej and Lavanya Tripathi Engagement Pics Goes Viral







































