OG నుండి సర్ ప్రైజ్

A surprise comes from OG

అసలు సుజిత్ పవన్ కళ్యాణ్ సినిమా మొదలు పెట్టడమే పెద్ద సెన్సేషన్. సాహో లాంటి ప్లాప్ తర్వాత సుజిత్ మెగాస్టార్ తో లూసిఫర్ రీమేక్ చెయ్యాల్సి ఉంది. కానీ సుజిత్ ను ఆ ప్రాజెక్ట్ నుండి తప్పించి ఆ ప్లేస్ లోకి మోహన్ రాజాని తీసుకొచ్చారు. ఆ తర్వాత సుజిత్ పవన్ కళ్యాణ్ కి కథ చెప్పి ఒప్పించాడనే టాక్ నడిచినా ఎవ్వరూ నమ్మలేదు. కానీ సడన్ గా పవన్ కళ్యాణ్-సుజిత్ సినిమా ప్రకటన రావడమే తరువాయి సినిమాకి పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి.

ఆ వెంటనే రెగ్యులర్ షూట్ అంటూ ముంబైలో మొదలు పెట్టేసారు. పవన్ కళ్యాణ్ OG రెండు షెడ్యూల్స్ లో పాల్గొన్నారు. ముంబైలో పవన్ షూట్ కి హాజరైంది మొదలు, ముంబైలో ప్యాకప్ చెప్పడం, ఆ తర్వాత పూణే లో షూట్ స్టార్ట్ చెయ్యడం ఇలా ప్రతి చిన్న విషయానికి మేకర్స్ సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూ ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. OG నుండి ఇకపై ఎలాంటి సర్ ప్రైజ్ లు రాబోతున్నాయో.. అది ఎలాంటి అప్ డేట్ రాబోతుందో అని ఫాన్స్ లో ఉత్సుకత మొదలయ్యింది.

నిన్న పవన్ కళ్యాణ్ ఓ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. పవన్ వెననక్కి తిరిగి నిలబడగా.. ఎదురుగా సముద్రం. అందులో ఓ పడవ.. దానిలో జన సైనికులు జనసేన జెండాతో పవన్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే అది వైరల్ అయ్యింది. అందులో పవన్ బ్యాక్ లుక్ మాత్రం డిఫరెంట్ గా కనిపించడంతో పవన్ ఫాన్స్ ఆ లుక్ ఏమిటో అర్ధం కాక కాస్త ఎగ్జైట్ అవుతున్నారు.

OG surprise update

og