ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Adipurush Trailer To Launch date Locked

పవర్ ఫుల్ పోస్టర్ తో ఆదిపురుష్ ట్రైలర్ డేట్

Adipurush Trailer To Launch date Locked

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, థియేటర్‌లలో ఒకే రోజు ట్రైలర్ విడుదల అవుతోంది

2023లో ప్రపంచం అంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆదిపురుష్. ఇప్పటికే భారీ అంచనాలు తెచ్చుకున్న ఆదిపురుష్‌ మూవీ ట్రైలర్ లాంచ్ కు వేళయింది. మే 9న గ్లోబల్ ట్రైలర్ లాంచ్‌తో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ మెగా ట్రైలర్ లాంచ్‌ను ప్రకటిస్తూ.. ఆదిపురుష్‌ నుంచి పాన్-ఇండియా స్టార్, ప్రభాస్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మాగ్నమ్ ఓపస్ ఇప్పటికే న్యూయార్క్‌లోని ట్రిబెకా ఫెస్టివల్‌లో అంతర్జాతీయ ప్రీమియర్‌కు సెలెక్ట్ కావడం ద్వారా ఓ గొప్ప మైల్ స్టోన్ ను సాధించింది. ఇప్పటికే విడుదలైన ప్రతి గ్లింప్స్ తో ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచింది. ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం అద్భుతమైన ట్రైలర్ తో రెడీ అయ్యింది. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో ఈ ట్రైలర్ ను రికార్డ్ స్థాయిలో లాంచ్ చేయబోతున్నారు. అందుకే ఇది వరల్డ్ ఈవెంట్ గా మారింది. 

భారతదేశంతో పాటు సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, శ్రీలంక, జపాన్‌తో సహా యూఎస్ఏ, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియా & దక్షిణాసియాలోని భూభాగాల్లో; ఆఫ్రికా, యూకే అండ్ యూరప్, రష్యా, ఈజిప్ట్ దేశాల్లో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ గొప్ప భారత ఇతిహాస కథ ప్రపంచ ప్రేక్షకులను ఓ సాహసోసేతమైన యాక్షన్ ప్రపంచంలోకి తీసుకువెళుతుంది.

Adipurush Trailer To Launch On May 9th

adipurush trailer