Advertisementt

రామబాణం పబ్లిక్ టాక్

Fri 05th May 2023 11:31 AM
rama banam public talk  రామబాణం పబ్లిక్ టాక్
Rama Banam Public Talk రామబాణం పబ్లిక్ టాక్
Advertisement
Ads by CJ

అన్నదమ్ముల సెంటిమెంట్ తో శ్రీవాస్ డైరెక్ట్ చేసిన రామ బాణం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోపీచంద్-జగపతి బాబు అన్నదమ్ములుగా నటించి, భారీ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ బాణం ఇప్పటికే హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మాక్స్ లో షో పూర్తి చేసుకుంది. రామ బాణం చూసిన ఆడియన్స్, ప్రెస్ రిపోర్ట్స్ సినిమా ఎలా ఉందో పూసగుచ్చినట్టుగా సోషల్ మీడియాలో రాసుకొచ్చేస్తున్నారు. మొదటి భాగం ఇలా ఉంది, సెకండ్ హాఫ్ అలా ఉంది, గోపీచంద్ బాగా చేసాడు, స్టోరీ ఇది అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

ఇక రామ బాణం పబ్లిక్ టాక్ లోకి వెళితే.. జగపతి బాబు, గోపీచంద్ మధ్య అన్నదమ్ముల బంధం హైలెట్ అయ్యేలా శ్రీవాస్ సినిమాని తెరక్కించారట, రొటీన్ స్టోరీనే అయినప్పటికీ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయని, ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని కొంతమంది ఆడియన్స్ మాట. జగపతి బాబు కెమికల్ ఫార్మింగ్ పై పోరాటం చేస్తూ ఆర్గానిక్ ఆహారం చేసే మేలు గురించి వివరిస్తారని, అన్నయ్య జగపతి బాబు, వదిన కోసం గోపీచంద్ చేసే యాక్షన్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ డింపుల్ హయ్యాతి యూట్యూబర్ గా తన అందం, నటనతో ఆకట్టుంది అంటున్నారు.

గోపీచంద్ తో డింపుల్ రొమాన్స్, అలాగే కామెడీ, ఫ్యామిలీ డ్రామా అన్ని కలగలిపిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటుంటే.. కొన్ని కామెడీ సీన్లు, ఇంకొన్ని పాటలు మినహా సినిమాలో ఆసక్తికర అంశాలు ఏమీ లేవని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. గోపీచంద్ మాత్రం చాలా స్టైలిష్‌గా ఉన్నారని.. సినిమా రొటీన్‌గా ఉందని.. పాతవాసన ముతక కథతో సినిమా చేశారని, గోపీచంద్ తప్ప సినిమాలో ప్లస్ పాయింట్లు ఏమీ లేవని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Rama Banam Public Talk:

Gopichand Rama Banam Public Talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ