ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Jagapathi Babu interesting comments on Salaar

సలార్ పై జగపతి బాబు ఆసక్తికర కామెంట్స్

Jagapathi Babu interesting comments on Salaar

ఈమధ్యన టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు జగపతి బాబు పేరు మోగిపోతుంది. పవర్ ఫుల్ విలన్ గా జగపతి బాబు పలు భాషల సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్, హిందీ మూవీస్, కన్నడ, తెలుగు, తమిళ ఇలా ప్రతి భాషలోనూ ఆయన పేరు మార్మోగిపోతోంది. ఇప్పటికే మహేష్ బాబు-త్రివిక్రమ్ SSMB28 లో తన రోల్ చాలా మాసివ్ గా పవర్ ఫుల్ గా డిఫరెంట్ గా ఉండబోతుంది అంటూ హింట్ ఇచ్చారు.

గోపీచంద్ తో కలిసి రామ బాణం మూవీ చేసిన జగపతి బాబు ఆ మూవీ ప్రమోషన్స్ లో చాలా విషయాలను పంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఆయన సలార్ గురించి మాట్లాడారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ దగ్గర నుండి ఓ ఎనిమిదిమంది విలన్స్ కనిపిస్తున్నారు. అందులో జగపతి బాబు కూడా ఓ విలన్ అనే అనుకుంటున్నారు. 

తాజాగా జగపతి బాబు సలార్ టాపిక్ తీస్తూ సలార్ లో తన రోల్ ఏమిటనేది తనకి తెలియదు, సలార్ కోసం ఓ ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేశాను. సెట్‌లో ఆ ఎగ్జైట్‌మెంట్‌ కావాలి కాబట్టి ఆ కథ గురించి కానీ, క్యారెక్టర్‌ గురించి కానీ ప్యాషనేట్‌ ఉన్న దర్శకులను నేను అడగను. ప్రశాంత్ నీల్ ఎక్సట్రార్డినరీ డైరెక్టర్ అంటూ జగపతి బాబు సలార్ సినిమా విషయంలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Jagapathi Babu on Salaar character

jagapathi babu
salaar