పవన్ లేకపోయినా పని ఆగడం లేదు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ చూస్తే పవన్ ఫాన్స్ కి మతి పోతుంది. ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాల సెట్స్ పై చేసే సందడికి పవన్ ఫాన్స్ ని నిలవనియ్యడం లేదు. సరదాగా నెమ్మదిగా సినిమాలు చేసే పవన్ కళ్యాణ్ ఇప్పుడు టార్గెట్ పెట్టుకుని షూటింగ్స్ కంప్లీట్ చేస్తున్నారు. సముద్రఖని తో తమిళ రీమేక్ షూట్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరి హర వీరమల్లు సెట్స్ లో హడావిడి చేస్తున్నారు.
అయితే సముద్రఖని-పవన్-సాయి తేజ్ PKSDT చిత్రంలో పవన్ కళ్యాణ్ పార్ట్ షూట్ కంప్లీట్ అవడమే తరువాయి జులై 28 న సినిమా రిలీజ్ అని సముద్ర ఖని తేదీ ప్రకటించేసారు. మరోపక్క ఇప్పటివరకు టైటిల్ ఇవ్వలేదు..రిలీజ్ కి మూడు నెలలు మాత్రమే సమయముంది అని పవన్ ఫాన్స్ కంగారు పడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో పనేం లేకపోవడంతో సాయి తేజ్ విరూపాక్ష సక్సెస్ నుండి బయటికి రావడమే PKSDT సెట్స్ లోకి వెళ్ళిపోయాడు.
మామ పవన్ లేకపోయినా పని అజరిగిపోతుంది. అందులో భాగంగానే సముద్రఖని తాజా షెడ్యూల్ ని హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో నైట్ షూట్ జరుపుతున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిన ఈ చిత్రం చిత్రీకరణ త్వరగా ముగించేసి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లే ఆలోచనలో టీం ఉందట. ఎందుకంటే సినిమా విడుదలకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి.
PKSDT shooting latest update
PKSDT latest update







































