పాటేసుకుంటున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan to sing a song again?

పవన్ కళ్యాణ్ లో చాలా టాలెంట్ ఉంది. ఒకప్పుడు ఆయన మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకతని చూపించేవారు. తర్వాత సినిమాలలో యాక్టింగ్ తో విశేషమైన అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇక సినిమాల్లో అవకాశం వస్తే ఆయన పాటలు కూడా పాడతారు. గతంలో అత్తారింటికి దారేది సినిమాలోనూ, అజ్ఞాతవాసిలో కూడా పవన్ కళ్యాణ్ పాటలు పాడి అద్భుతః అనిపించారు. తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి గొంతు సవరించబోతున్నట్లుగా తెలుస్తుంది. 

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పాట పాడబోతున్నారట, వీరమల్లు సంగీత దర్శకుడు కీరవాణి ఈ పాట రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారట. త్వరలోనే పవన్ కళ్యాణ్‌తో పాట రికార్డింగ్ చేయించనున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ పాట పాడితే ఆయన అభిమానులు ఎంతలా ఊగిపోతారో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ముంబైలో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG షూటింగ్ లో ఉన్నారు.

ముంబై లో ఆ షెడ్యూల్ పూర్తి కాగానే పవన్ హరి హర వీరమల్లు సెట్స్ లోకి వస్తారని తెలుస్తుంది. హరిహర వీరమల్లు సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించబోతుంది.

Hari Hara Veera Mallu: Pawan Kalyan to croon for a special number?

hari hara veera mallu
pawan kalyan