ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nayanthara Lost Her Cool At Kumbakonam Temple

భక్తులపై నయనతార ఆగ్రహం

నయనతార-విగ్నేష్ శివన్ లు గత ఏడాది పెళ్లి చేసుకునే ముందు, పెళ్లి చేసుకున్న తర్వాత పలు ఆలయాలను సందర్శించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హనీమూన్, సరోగసి ద్వారా ట్విన్స్ ని ఎత్తుకోవడం.. ఇవన్నీ లీగల్ సమస్యలకు దారి తీసినా నయనతార-విగ్నేష్ శివన్ లు అవన్నీ ఎదుర్కొని.. ప్రస్తుతం పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యనే తమ ట్విన్స్ పేర్లు రివీల్ చేసిన ఈ జంట ఏప్రిల్ 5 న కుంభకోణం టెంపుల్ కి స్పెషల్ పూజల కోసం వెళ్లారు.

ఆ రోజు గుడికి వెళుతున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తర్వాత టెంపుల్ లో నయనతార-విగ్నేష్ శివన్ లు పూజలు నిర్వహిస్తున్న సమయంలో భక్తులు గొడవకు దిగడమే కాకుండా.. నయన్-విగ్నేష్ ల ఫొటోస్ , వీడియోస్ తియ్యడానికి ఎగబడడంతో.. నయనతార ఆగ్రహంతో.. మేము ఓ ఐదు నిమిషాలుంటే వెళ్ళిపోతాము, ఐదు నిమిషాల్లో మా పూజ పూర్తవుతుంది. మీలాగే మేము దైవ దర్శనానికి వచ్చాము అంటూ అక్కడ భక్తులపై విరుచుకుపడినట్లుగా తెలుస్తుంది.

Nayanthara and Vignesh Shivan Visit Their Deity Temple

Nayanthara Lost Her Cool At Kumbakonam Temple
nayanthara
vignesh shivan