Advertisementt

రావణాసుర vs మీటర్: గెలుపెవరిది

Thu 06th Apr 2023 05:25 PM
ranasura vs meter  రావణాసుర vs మీటర్: గెలుపెవరిది
Ranasura vs Meter రావణాసుర vs మీటర్: గెలుపెవరిది
Advertisement
Ads by CJ

కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ మీటర్ రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతుంది. రాజావారు రాణి గారు తో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన కిరణ్ అబ్బవరం ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తున్నాడు. ఆరు నెలలకో సినిమా అన్నట్టుగా చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం బడా నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం కి కెరీర్ లో ఇప్పటివరకు  సూపర్ హిట్ పడలేదు. జస్ట్ యావరేజ్ మూవీస్ తోనే సరిపెట్టుకుంటూ వరస ప్రాజెక్ట్స్ చేస్తున్న కిరణ్ అబ్బవరానికి టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలైన మైత్రి మూవీ మేకర్స్, గీత ఆర్ట్స్ లంటి వారి సపోర్ట్ ఉంది

ప్రస్తుతం మైత్రి మూవీస్ నుండి కిరణ్ అబ్బవరం మీటర్ రేపు శుక్రవారం రిలీజ్ అవుతుండగా.. అదే రోజు రవితేజ రావణాసుర విడుదలకు రెడీ అయ్యింది. ధమాకా, వాల్తేర్ వీరయ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఉన్న రవితేజ ఇప్పుడు రావణాసుర ప్రమోషన్స్ పరంగాను దూసుకుపోతున్నాడు. రవితేజ రావణాసురపై అంచనాలు బాగున్నాయి. బుక్ మై షో లో క్రేజీగా టికెట్స్ తెగుతున్నాయి. కానీ మీటర్ పరిస్థితి మరోలా ఉంది. మీటర్ కి బుక్ మై షో లో అంతగా క్రేజ్ కనిపించడం లేదు,.

ఇప్పటివరకు మల్టిప్లెక్స్ లో ఒక్క థియేటర్ ఫుల్ కాలేదు, రావణాసురకి ఓపెనింగ్స్ బావున్నాయి. ఈ వారం రవితేజ రావణాసుర మీద ఆడియన్స్ హోప్స్ పెట్టుకున్నారు. నేను మీకు బాగా కావల్సిన వాడిని జస్ట్ యావరేజ్ తో కిరణ్ అబ్బవరం మాస్ మీటర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రవితేజ గెలుస్తాడా.. లేదంటే మొదటిసారి మీటర్ తో కిరణ్ హిట్ అందుకుంటాడా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది.

Ranasura vs Meter:

Raviteja Ranasura vs Kiran Abbavaram Meter

Tags:   RANASURA VS METER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ