నయన్ ట్విన్స్ పేర్లు చెప్పేసింది

Nayanthara twins names revealed

నయనతార-విగ్నేష్ శివన్ లు ఏడేళ్ల ప్రేమని 2022లో వివాహ బంధంలోకి తీసుకువెళ్లారు. గత ఏడాది పెళ్లి చేసుకుని ఒక్కటయిన ఈ జంట నెల తిరక్కుండానే సరోగసి ద్వారా తల్లితండ్రులయ్యారు. నయనతార సరోగసి ద్వారా ట్విన్స్ కి తల్లయ్యింది. ఈ సరోగసి వ్యవహారంలో నయన్-విగ్నేష్ లపై విమర్శలు తలెత్తడమే కాకుండా.. లీగల్ గాను చిక్కులు ఎదుర్కొన్నారు. అయితే వారి పిల్లలు తమ చేతుల్లోకి వచ్చాక ఫేస్ రివీల్ చేయాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ట్విన్స్ తో సహా పబ్లిక్ లో తిరిగింది ఈ జంట.

అయితే నయనతార తమ బిడ్డలకి ఎప్పుడో పేర్లు పెట్టిన అవి ఇంతవరకు రివీల్ చెయ్యలేదు. తాజాగా నయనతార పిల్లల క్యూట్ నేమ్స్ ని రివీల్ చేసింది. తన ఇద్దరి బిడ్డలకి తన పేరు, భర్త విగ్నేష్ శివన్ పేరు కలిసొచ్చేలా నయన్ పేర్లు పెట్టినట్లుగా తెలుస్తుంది. తమ మొదటి కొడుకు పేరు ఉయర్ రుద్రోనిల్ ఎన్ శివన్ అని, రెండవ కొడుకు పేరు ఉలాగ్ ధైవాగ్ ఎన్ శివన్ అంటూ చెప్పడంతో నయన్ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

ఇంతవరకు ట్విన్స్ మొహాలని చూపించకపోయినా.. పేర్లతో ఇలా ట్రీట్ ఇచ్చింది అంటూ వారు ఉత్సాహపడుతున్నారు. ఇక ప్రస్తుతం నయనతార షారుఖ్ తో జవాన్ సినిమా చేస్తుంది. ఆ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవగా.. ఇప్పుడు భర్త విగ్నేష్ శివన్ కొత్త చిత్రం కోసం ఆరాటపడిపోతుంది. 

Nayanthara names her twins beautifully

nayanthara