Advertisementt

దసరా ఓటిటి పార్ట్నర్ రివీల్డ్

Thu 30th Mar 2023 07:15 PM
dasara ott partner revealed  దసరా ఓటిటి పార్ట్నర్ రివీల్డ్
Dasara OTT Partner Revealed దసరా ఓటిటి పార్ట్నర్ రివీల్డ్
Advertisement
Ads by CJ

ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ గా విడుదలైన నాని దసరా ఫిల్మ్ కి పాజిటివ్ టాక్ వచ్చేసింది. క్రిటిక్స్ నుండి, ప్రేక్షకుల నుండి నాని దసరా బావుంది అంటూ ఒపీనియన్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే.. మరికొంతమంది దసరా రివ్యూస్ చూసి టికెట్స్ బుక్ చేసేస్తున్నారు. బిగ్ బడ్జెట్ మూవీస్ కి ఉన్న అంచనాలు దసరా పై రావడానికి నాని చాలా కష్టపడ్డాడు. దసరా ప్రమోషన్స్ కోసం పలు సిటీస్ కి ఒంటరిగానే ట్రావెల్ చేసి ఆయా భాషల మీడియా ద్వారా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసాడు. అలా దసరాపై పాన్ ఇండియా ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చెయ్యడంలో నాని 100 పర్సెంట్ సక్సెస్ అయ్యాడు.

దసరా విడుదలైన ప్రతి థియేటర్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించడమే కాదు.. బుక్ మై షో లోను దసరా బుకింగ్స్ చాలా బావున్నాయి. నాని నటనని, కీర్తి సురేష్ వెన్నెల పాత్రని, BGM ని, ఇంకా శ్రీకాంత్ ఓదెల మేకింగ్ స్టయిల్ ని, సినిమాటోగ్రఫీని పొగిడినవారే కానీ పొగడని వారు లేదు. చమ్కీలా అంగిలేసే సాంగ్ ని ఇప్పటికే సూపర్ హిట్ చేసారు మ్యూజిక్ లవర్స్. కథ, కథనం రొటీన్ గానే ఉన్నా, సెకండ్ హాఫ్ లాగ్ అనిపించినా నాని ధరణి కేరెక్టర్ అవన్నీ మరపించేసింది అంటున్నారు. నానికి ధరణి కేరెక్టర్ కెరీర్ బెస్ట్ అంటూ కితాబునిస్తున్నారు.

మరి థియేటర్స్ లో హిట్ టాక్ తెచ్చుకున్న దసరాని ప్రముఖ ఓటిటి సంస్థ భారీ ధరకు దక్కించున్నట్లుగా తెలుస్తుంది. నెట్ ఫ్లిక్స్ దసరా స్ట్రీమింగ్ రైట్స్ ని దక్కించుకుని.. ఓటిటి పార్టనర్ గా నిలవగా.. ఈ చిత్రం ఏడెనిమిది వారాల తర్వాతే ఓటిటిలోకి వచ్చేలా కనబడుతుంది. ఎందుకంటే సినిమాకి హిట్ టాక్ వచ్చేసింది. సో ఏడెనిమిదివారాల పాటు థియేటర్స్ లో దున్నేయ్యడం ఖాయమే.

Dasara OTT Partner Revealed:

Nani Dasara OTT Partner Revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ