Advertisementt

రవితేజ రావణాసుర ట్రైలర్ రివ్యూ

Tue 28th Mar 2023 07:21 PM
ravi teja,ravanasura trailer review  రవితేజ రావణాసుర ట్రైలర్ రివ్యూ
Ravi Teja Ravanasura Trailer Review రవితేజ రావణాసుర ట్రైలర్ రివ్యూ
Advertisement
Ads by CJ

ధమాకా, వాల్తేర్ వీరయ్య మూవీస్ సక్సెస్ తో జోష్ మీదున్న రవితేజ రావణాసుర ని విడుదలకు రెడీ చేసేసాడు. ఏప్రిల్ 7న విడుదలకు రెడీ అయిన రావణాసుర ని భారీగా ప్రమోట్ చేస్తున్నాడు రవితేజ. రావణాసుర టీజర్‌ లో సినిమాలోని యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని చూపించారు. ట్రైలర్ కోర్ పాయింట్ గురించి పెద్దగా వెల్లడించనప్పటికీ, ఇతర అంశాలను ప్రజంట్ చేసింది. రావణాసుర ట్రైల్ ర్లోకి వెళితే.. మర్డర్ మిస్టరీగా ప్రారంభమవుతుంది. సంపత్ రాజ్ తాను నిర్దోషినని చెబుతాడు. 

క్రిమినల్ లాయర్ గా ఎంటర్ అయిన రవితేజ తన సీనియర్ ఫారియా అబ్దుల్లాను కేసును టేకప్ చేయాల్సిందిగా కోరుతాడు. కానీ ఆమెకు కనీసం ఆసక్తి లేదు. అప్పుడు, రవితేజ పాత్రలోని ఇతర షేడ్స్‌ని చూస్తాము. పోలీసు అధికారి, రాజకీయ నాయకుడు అతన్ని క్రిమినల్ అని పిలుస్తుండగా, అతను కూడా చివరికి అదే ఒప్పుకుంటాడు. సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయో చూపించేలా ట్రైల‌ర్‌ని గొప్ప నేర్పుతో ఎడిట్ చేశారు. అయితే, సినిమా కోర్ పాయింట్ ఏమిటనేది చూపించకుండా మరింత క్యురియాసిటీని పెంచారు. దర్శకుడు సుధీర్ వర్మ తన టేకింగ్‌ తో కట్టిపడేశారు. రవితేజను చాలా షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేశాడు.  

రవితేజ ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. రవితేజ కామిక్ టైమింగ్ సాధారణంగా అద్భుతంగా వుంటుంది. అయితే  పాత్ర యొక్క డార్క్ షేడ్స్ ని చూసే చివరి షాట్ ఎక్స్ టార్డీనరీగా వుంది. జోకర్ పోస్టర్ యాటిట్యూడ్, ఈవిల్ స్మైల్ చూడటానికి ఒక ట్రీట్‌లా వున్నాయి.

Ravi Teja Ravanasura Trailer Review:

Ravi Teja Ravanasura Trailer Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ