సెలబ్రిటీస్ కి అదిరిపోయే పార్టీ ఇచ్చిన చరణ్

Ram Charan 38th birthday bash

నిన్న మార్చ్ 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. ఉదయం నుండే సినీ,రాజకీయ ప్రముఖులు చరణ్ ని సోషల్ మీడియా ద్వారా విష్ చేసారు. ఆర్.ఆర్.ఆర్ సక్సెస్, ఆస్కార్ , గోల్డెన్ గ్లొబ్, HCA అవార్డులతో రామ్ చరణ్ ఈ ఏడాది బిగ్గెస్ట్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్ బర్త్ డే రోజు ఆయన నటిస్తున్న RC15 నుండి టైటిల్, అలాగే చరణ్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు టాప్ డైరెక్టర్ శంకర్. అయితే రామ్ చరణ్ ఉదయం ఇంట్లోనే కేక్ కట్ చేసి బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకోగా.. రామ్ చరణ్ ఇచ్చే పార్టీపై చాలామందిలో చాలా ఆత్రుత కనిపించింది. ప్రతి ఏడు వచ్చే బర్త్ డే వేరు.. ఈ బర్త్ డే వేరు అన్నట్టుగా ఉంది చరణ్ ప్రస్తుతం సక్సెస్ టూర్.

అయితే గత రాత్రి రామ్ చరణ్ హైదరాబాద్ లో సినీ ప్రముఖులకు అదిరిపోయే బర్త్ డే పార్టీ ఇచ్చాడు. రామ్ చరణ్ ఇచ్చిన ఈ పార్టీకి అక్కినేని ఫ్యామిలీ నాగార్జున, అఖిల్, నాగ చైతన్య, అమల, ఇంకా విజయ్ దేవరకొండ, రాజమౌళి ఫ్యామిలీ, కార్తికేయ, రానా, పాన్ ఇండియా దర్శకులు సుకుమార్, ప్రశాంత్ నీల్, వెంకటేష్, కాజల్ ఆమె భర్త, చరణ్ తో వర్క్ చేస్తున్న కియారా అద్వానీ తన భర్త సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి చరణ్ బర్త్ డే పార్టీకి హాజరైంది. దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు ఆయన భార్య ఇంకా రామ్ చరణ్ తో పని చేస్తున్నవారు ఈ పార్టీలో సందడి చేసారు.

రామ్ చరణ్-ఉపాసన కలిసి దిగిన బర్త్ డే పార్టీ పిక్స్, వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పార్టీలో ఉపాసన బేబీ బంప్ ఫొటోస్ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ఇచ్చిన ఈ మెగా అదిరిపోయే బర్త్ డే పార్టీ గురించే ఇండస్ట్రీలో అందరూ మట్లాడుకునేలా.. చరణ్ ఈ పార్టీని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది.

Celebs at Ram Charan 38th birthday party in Hyderabad

ram charan