SSMB28 బ్లాస్టింగ్ అప్ డేట్ ఎప్పుడో తెలుసా?

Massive Update About SSMB28 Glimpse

ఉగాదికి SSMB 28 నుండి టైటిల్ అండ్ మహేష్ లుక్ వస్తుంది అని మహేష్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఎక్స్పెక్ట్ చెయ్యడం కాదు.. రచ్చ చేసారు. హరిక అండ్ హాసిని క్రియేషన్స్ ని నానా తిట్లు తిట్టారు. అయితే ఉగాదికి SSMB28 అప్ డేట్ ఇవ్వడం లేదు.. మహేష్ మాసివ్ లుక్ ఆన్ ద వే అంటూ మహేష్ ఫాన్స్ ని చల్లార్చిన మేకర్స్.. నిన్న ఆదివారం ఉన్నట్టుండి.. మహేష్ మాసివ్ లుక్ తో పాటుగా వచ్చే సంక్రాంతి జనవరి 13న SSMB28 రిలీజ్ అంటూ మేకర్స్ గ్రాండ్ గా ప్రకటించారు.,

త్రివిక్రమ్ మహేష్ ని ఎలాంటి లుక్ లో చూపిస్తారో అంటూ మహేష్ ఫాన్స్ ఎంతగా వెయిట్ చేసారో.. అంతకు మించిన అంచనాలు పెట్టుకున్నారు. తివిక్రమ్ కూడా మహేష్ ఫాన్స్ ని అస్సలు డిస్పాయింట్ చెయ్యలేదు. అతడు, ఖలేజాలకి మించి మహేష్ ని మాసివ్ గా కాదు దుమ్మురేగిపోయేలా ప్రెజెంట్ చెయ్యబోతున్నట్టుగా ఫస్ట్ లుక్ తో కన్ ఫర్మ్ చేసారు. ఇక మహేష్ SSMB28 లుక్ మహేష్ ఫాన్స్ కి పూనకలొచ్చేశాయి.

మళ్ళీ SSMB28 నుండి ఎప్పుడుబడితే అప్పుడే అప్ డేట్ రాదు.. మరో రెండు నెలలవరకు SSMB28 నుండి అప్ డేట్ ఆశించవద్దు.. మే 31న కృష్ణగారి బర్త్ యానివర్సరీ సందర్భంగానే మీకు SSMB28 నుండి మాసివ్, హైపర్ అప్ డేట్ వస్తుంది అప్పటివరకు కామ్ గా ఉండండి .. సహనంతో ఉండండి అంటూ నిర్మాత నాగవంశీ మహేష్ ఫాన్స్ ని వేడుకున్నాడు. 

We are glad that all Super Fans are happy with Fantastic #SSMB28 update?! 🤩 The next Hyper Massy update will be coming out in May, on the eve of Superstar Krishna gari Birthday ❤️Until then, we hope you'll wait patiently. 😜 అంటూ ట్వీట్ చేసాడు. 

SSMB 28 Next Big Update On 31st May

ssmb 28
mahesh babu