ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kiraak RP Comments on Nellore Pedda Reddy Chepala Pulusu

చిరుకి, ప్రభాస్‌కి ఆ చేపల పులుసు చేరిందా?

Kiraak RP Comments on Nellore Pedda Reddy Chepala Pulusu

కిర్రాక్ ఆర్పీ.. ఒకప్పుడు జబర్దస్త్‌లో ఫేమస్ కమెడియన్.. ఇప్పుడు జబర్దస్త్‌కి రెబల్ కమెడియన్. జబర్దస్త్ యాజమాన్యంపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి.. కామెడీ షోలకి దూరమయ్యాడు. అలాగే సినిమా తీస్తానని చెప్పిన కిర్రాక్ ఆర్పీ.. ఏం చేసినా కిర్రాక్ గానే ఉంటుంది. తనకున్న పలుకుబడితో నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసుని కూకట్ పల్లి ఏరియాలో చాలా గ్రాండ్‌గా ఓపెన్ చేసాడు. జస్ట్ కర్రీ పాయింట్‌లా ఓపెన్ చేసిన కిర్రాక్ ఆర్పీ.. అక్కడికి వచ్చే జనాలను తట్టుకోలేక నెల రోజులకే మూత వేశాడు. కిచెన్‌ని, షాప్‌ని ఇంకా పెంచి.. త్వరలోనే ఓపెన్ చేస్తాను అంటూ.. ప్రస్తుతం నెల్లూరు చేపల పులుసు బాగా వండేవాళ్ళ‌ని పిలిచి ఆడిషన్స్ చేస్తున్నాడు.

ఏ యూట్యూబ్ ఛానల్స్ అయితే ఆర్పీనెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసుని ఫేమస్ చేశాయో.. అదే యూట్యూబ్ ఛానల్స్ మళ్ళీ ఆర్పీ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తావ్ అని అడుగుతున్నారు. ఇక ఆర్పీ త్వరలోనే షాప్ ఓపెన్ చేస్తాను, క్రౌడ్ తట్టుకోవడం కష్టముగా ఉంది, అందరికి అందించాలనే తపనతో కొద్దిరోజులు మూసేశా అని చెప్పాడు. మీకు పెద్ద పెద్ద స్టార్స్ నుండి చేపల పులుసు కావాలని ఫోన్స్ వచ్చాయట నిజమేనా అని అడగగా.. అవును కానీ ఇప్పుడే వాళ్ళ పేర్లు చెప్పను.. చిరు, ప్రభాస్‌లకి చేపల పులుసు పంపించాను. ఇంకా చాలామంది ఉన్నారు అమ్మతోడు, అప్పుడే వాళ్ళ పేర్లు బయటపెట్టనని చెబుతున్నాడు.

నాగబాబుగారికి పంపించావా అనగానే నాగబాబు‌గారు నాన్ వెజ్ తినరు. అయినా ఆయన జనసేన పార్టీ పనులలో బిజీగా ఉన్నారు. ఎలక్షన్స్ టైం కదా ఆయన్ని డిస్టర్బ్ చెయ్యను అన్నాడు ఆర్పీ. ఇక తనలో కాన్ఫిడెంట్ లేదని, భయం ఉందని, అలాంటప్పుడే ఈ షాప్ ని మరింతగా ముందుకు తీసుకువెళతానని ఆర్పీ చెబుతున్న ఇంటర్వూస్ వైరల్ గా మారాయి.

Auditions for Kiraak RP Nellore Pedda Reddy Chepala Pulusu

kiraak rp
nellore pedda reddy chepala pulusu
chiranjeevi
prabhas