న్యూయార్క్ వీధుల్లో భార్య ప్రణతితో ఎన్టీఆర్
NTR, Lakshmi Pranathi snap from NewYorkయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం యుఎస్ ట్రిప్ లో భార్య పిల్లలతో జాలిగా స్పెండ్ చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని NTR30 మొదలు పెట్టాల్సిన ఎన్టీఆర్ ఇలా వెకేషన్స్ లో ఎంజాయ్ చెయ్యడం అభిమానులకి నచ్చకపోయినా.. మా హీరో ఇలా కనిపిస్తున్నాడని ఆనందపడుతూ సరిపెట్టుకుంటున్నారు. ఒకరోజు ముందు న్యూయార్క్ కిచెన్ లో సందడి చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు న్యూయార్క్ వీధుల్లో భార్య లక్ష్మి ప్రణతితో కలిసి చక్కర్లు కొడుతున్నాడు.
అక్కడ న్యూయార్క్ చలిని తట్టుకోలేక స్వేట్టర్స్ వేసుకుని బాడీ ని కవర్ చేస్తూ సాక్స్ లు, షూస్ వేసుకుని వీరిద్దరూ రొమాంటిక్ గా కనిపించారు. భార్గవ్ రామ్, అభయ్ రామ్ లు లేకుండా ఎన్టీఆర్ భార్యతో కలిసి న్యూయార్క్ వీధుల్లో తిరుగుతూ ఫొటోలకి ఫోజులిచ్చారు. అయితే భార్గవ్ ని, అభయ్ ని అక్కడి చలికి, మంచుకి భయపడి బయటికి తీసుకురాలేదనిపిస్తుంది. ఇక నైట్ ఇలా ఎన్టీఆర్-ప్రణతిలు కలిసి ఎంజాయ్ చేస్తున్న పిక్ ని ఎన్టీఆర్ ఇన్స్టాలో పోస్ట్ చేసాడు. అది కాస్త ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.
ఎందుకంటే ఎన్టీఆర్-ప్రణతి కలిసి చాలా అరుదుగా కనబడతారు , అభిమానులకి ట్రీట్ ఇస్తారు. అందుకే ఇప్పుడు ఈ పిక్ క్షణాల్లో వైరల్ అయ్యింది.
NTR with his wife Lakshmi Pranathi romantic snap







































