బిగ్ బాస్ నుండి BB జోడికి

బిగ్ బాస్ సీజన్ 6 ముగిసింది. సింగర్ రేవంత్ విన్నర్ అయ్యాడు. గత ఆదివారం బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తో ఆ హడావుడిని నాగార్జున వ్యాఖ్యాతగా ముగించారు. ఇక ఈ వారం BB జోడీని గ్రాండ్ గా మొదలు పెడుతున్నారు. శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు BB జోడి ప్రసారమవుతుంది, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో స్టార్ మా ఈ ప్రోగ్రాం ని రిచ్ సెటప్ తో అలనాటి అందాల తార రాధా, కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్, అలాగే హీరోయిన్ సదా లు జెడ్జ్ లుగా మొదలు పెడుతున్నారు. 

ఈ BB జోడి కి కింగ్ నాగార్జున గెస్ట్ గా వచ్చారు. ఆయన కూడా స్టేజ్ పై అదిరిపోయే డాన్స్ పెరఫార్మెన్స్ తో కంటెస్టెంట్స్ ని ఉర్రుతలూగించారు. ఈ గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ నాగార్జున స్పెషల్ డాన్స్ తో కళకళలాడింది. శ్రీముఖి యాంకర్ గా ఈ షో మొదలవుతుంది. BB జోడి లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన అఖిల్ సార్థక్-తేజస్వి ఓ జోడి, మెహబూబ్-ఆశు రెడ్డి ఓ జోడి, సూర్య-ఫైమా ఓ జోడి, భాను-రవికృష్ణ ఓ జోడి ఇలా జోడీలుగా విడిపోయి డాన్స్ పెరఫార్మెన్స్ ఇస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ కూడా ఈ ప్రోగ్రాంలో భాగమయ్యారు.

ఒక్కో బిగ్ బాస్ జోడి ఈ BB జోడి డాన్స్ షోలో ఇరగదీస్తున్న ప్రోమోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రోజు డిసెంబర్ 25 ఆదివారం సాయంత్రం BB జోడి ని స్టార్ మా గ్రాండ్ గా లాంచ్ చేయబోతుంది.

BB Jodi Grand launch episod

BB Jodi Grand launch at Star Maa
bb jodi
star maa
Advertisement
Advertisement