ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anand Sensational comments on Jabardasth

జబర్దస్త్ నుండి గెంటేశారంటున్న కమెడియన్

Anand Sensational comments on Jabardasth

ఒకప్పుడు కూల్ గా కామెడీ షోస్ కే మహారాజు లా వెలిగిన జబర్దస్త్ ఇప్పుడు మసకబారుతుంది. అంతేకాకుండా జబర్దస్త్ రాజకీయాలు ఒక్కొక్కటిగా యూట్యూబ్ ఛానల్స్ లోకి ఎక్కుతున్నాయి. టీమ్ లీడర్స్ కంటెస్టెంట్స్ ని కాస్త చీప్ గా చూస్తారని, అక్కడ ఫుడ్ బాగోదని ఇలా చాలా రకాల విషయాలు బయటికి వచ్చేసాయి. అయితే తాజాగా జబర్దస్త్ కమెడియన్ ఒకరు తనని జబర్దస్త్ నుండి గెంటేశారు, పిల్లలున్నారు ప్లీజ్ అని బ్రతిమాలినా తనని తీసుకోలేదంటూ జబర్దస్త్ యాజమాన్యంపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. అతనెవరో కాదు చమ్మక్ చంద్ర స్కిట్ లో చేసే ఆనంద్.

అతను ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రస్తుతం జబర్దస్త్ టైమ్ మార్చారు. గతంలో గంటన్నర ఉండే సమయం.. ఇప్పుడు గంటకి కుదించడంతో స్కిట్స్ కూడా తగ్గించేశారు. జబర్దస్త్ లో చంద్ర వెళ్ళిపోయాక నేను టీమ్ ఫామ్ చేసుకుని స్కిట్స్ చేశాను. కానీ సమయం కుదించడంతో నా టీమ్ తీసేసారు. తర్వాత ఎవరి టీమ్ లో అయినా నన్ను కంటెస్టెంట్ గా చేరమని చెప్పారు. కానీ నన్ను ఎవరూ తీసుకోలేదు. పిల్లలున్నారు, ఇలా మధ్యలో వదిలేస్తే ఎలా.. ఫుడ్ కూడా ఉండదు కాస్త ఆలోచించండి అని అడిగినా ఎవరూ ఒప్పుకోలేదు. నేను చమ్మక్ చంద్ర అన్న దగ్గర నేర్చుకున్న నటన, కామెడీతో మంచి టీమ్ లీడర్ గా స్కిట్స్ చేశాను. నా స్కిట్స్ కి లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. కానీ నన్ను అలా జబర్దస్త్ నుండి గెంటేశారు.

జబర్దస్త్ నుండి బయటికి వచ్చాక సీరియల్స్ లో నటిస్తూ ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాను, అంతేకాకుండా ఓ అడుగు రియల్ ఎస్టేట్ రంగంలోకి వేసాను అంటూ జబర్దస్త్ నుండి తాను బయటికి వచ్చేసిన విధానాన్ని బయట పెట్టాడు ఆనంద్.

Anand comments on Jabardasth

anand
jabardasth