ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Natural Star Nani Latest Tweet Goes Viral

నాని ఆఫీస్‌లో హీరోయిన్‌తో హీరో రొమాన్స్!

Natural Star Nani Latest Tweet Goes ViralNatural Star Nani Latest Tweet Goes Viral

న్యాచురల్ స్టార్ నాని ఆఫీస్‌లో హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తూ.. హీరో దొరికేశాడు. ఈ విషయం స్వయంగా నానినే రివీల్ చేయడం విశేషం. ఇంతకీ ఆ హీరోహీరోయిన్లు ఎవరని అనుకుంటున్నారా? యంగ్ హీరో అడివి శేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఈ పేర్లకి, నానికి సంబంధం ఏమిటో ఇప్పటికే అర్థమై ఉండాలి. వాళ్లిద్దరితో నాని సినిమా తీశాడు. ‘హిట్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘హిట్2’ చిత్రం అతి త్వరలో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ భారీగా నిర్వహించే ప్రయత్నాలు చేస్తోంది. ఇదే ఛాన్స్ అనుకుని హీరో అడివి శేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి రొమాన్స్‌లో మునిగిపోయారు. అయ్యబాబోయ్.. నా ఆఫీస్‌ని ఆగం చేయకండ్రా బాబూ అంటూ నాని ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేయడంతో.. వారిద్దరి రొమాన్స్ వ్యవహారం బయటికి వచ్చింది. ఏంటీ ఇదంతా సీరియస్ అని అనుకుంటున్నారా? కానే కాదు. 

 

‘హిట్2’ సినిమాకు సంబంధించి తాజాగా ఓ సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. అంతకుముందు విడుదలైన టీజర్‌కు యూట్యూబ్ కొన్ని కండీషన్స్ పెట్టడంతో.. ఈ సాంగ్‌తో ఎంజాయ్ చేయాలని అడివి శేష్ ఓ వీడియోను విడుదల చేశాడు. సిధ్ శ్రీరామ్ వాయిస్‌లో వచ్చిన ఈ పాట వినగానే శ్రోతల్ని అలరించేలా ఉంది. ఇప్పుడదే సాంగ్‌కి హీరో అడివి శేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి.. నాని ఆఫీస్‌లో డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్‌లో వారి కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఉంది. అందుకే నాని ‘నా ఆఫీస్‌ని ఇలా కూడా వాడొచ్చా’ అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. ఇప్పుడా ట్వీట్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

Hit 2 Promotion.. Nani Punch on Adivi Sesh

natural star nani
adivi sesh
hit 2 promotion
tweet