ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 6: Those three in the danger zone

బిగ్ బాస్ 6: డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు

Bigg Boss 6: Those three in the danger zone

బిగ్ బాస్ సీజన్ 6 నుండి ఇప్పటి వరకు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లిన వాళ్లలో చంటి, సూర్య, గీతూ ఎలిమినేషన్స్ ని ఎవరూ ఊహించకపోయేసరికి.. దానితో వారం వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే విషయంలో ఉత్కంఠ కనిపిస్తుంది. స్ట్రాంగ్ స్ట్రాంగ్ అనుకున్నవారు ఎలిమినేట్ అవుతుండడంతో.. ఈ వారం ఎలిమినేషన్ పై అందరిలో ఆశక్తి బయలుదేరింది. ఈ వారం తొమ్మిదిమంది నామినేషన్స్ లో ఉన్నారు. రోహిత్ ఇంకా రాజ్ అలాగే కెప్టెన్ అయిన కారణంగా శ్రీ సత్య తప్ప మిగతా వారంతా నామినేషన్స్ లోకి వెళ్లారు. ఈ వారం ఇంటి నుండి బయటికి వెళ్లబోయే పదో హౌస్ మేట్ మీద అందరిలో క్యూరియాసిటీ పీరిగిపోతుంది.

అయితే ఓటింగ్ లెక్కల్లో అయితే రేవంత్ మరియు ఇనాయ టాప్ ప్లేస్ కోసం ఈ వారమంతా పోటీపడినట్లుగా తెలుస్తుంది. ఇక మూడో స్థానంలో శ్రీహన్, నాలుగో స్థానంలో ఆదిరెడ్డి, ఫైమా ఐదో స్థానంలో, కీర్తి భట్ ఆరో స్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మిగతా స్థానాల్లో వరసగా బాలాదిత్య 7th ప్లేస్ లో, మరీనా ఎనిమిదో స్థానంలో ఉండగా.. వాసంతి మాత్రం తొమ్మిదో ప్లేస్ లోకి పడిపోయినట్లుగా తెలుస్తుంది. మరి ఓటింగ్ లెక్క ప్రకరమైతే బాలాదిత్య-మరీనా-వాసంతిలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి.. కానీ బిగ్ బాస్ లెక్క ఎలా ఉందొ ఈ రోజు రాత్రి కల్లా తేలిపోతుంది. అంటే హౌస్ నుండి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది ఈ రోజు శనివారం రాత్రికి బయటికి వచ్చే లీకులతో తేలిపోతుంది.

Bigg Boss 6: Baladitya, Mareena, vasanthi in danger zone

bigg boss 6
baladitya
vasanti