ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pushpa regular shoot starts from Nov 3rd week

పుష్ప 2 రెగ్యులర్ షూట్ అప్పుడే

Pushpa regular shoot starts from Nov 3rd week

అల్లు అర్జున్ పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ కోసం ఇండియా వైడ్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. పుష్ప పార్ట్ 1 తో పెను సంచలనాలకి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్-సుకుమార్ ద్వయం.. పార్ట్ 2 పై అంచనాలు పెంచేస్తున్నారు. అయితే సెప్టెంబర్ లోనే పూజా కార్యక్రమాలు జరుపుకున్న పుష్ప ద రూల్ రెగ్యులర్ షూటింగ్ కి బాగా టైమ్ తీసుకుంటుంది. మధ్యలో టెస్ట్ షూట్, అలాగే హాలీవుడ్ స్టెంట్ మాస్టర్, కెమెరా మేన్ తో అల్లు అర్జున్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజాగా పుష్ప ద రూల్ హాష్ టాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అల్లు ఫాన్స్. అయితే రెగ్యులర్ షూట్ నవంబర్ 3 వ వారం నుండి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని, అది కూడా బ్యాంకాక్ లో మొదలు కాబోతుంది అంటూ అల్లు ఫాన్స్ హడావిడి చేస్తున్నారు. దీనికి సంబందించిన అప్ డేట్ కూడా నవంబర్ 13 న రాబోతుంది హడావిడి చేస్తున్నారు. మరి దీనిపై మైత్రివారు ఎలా స్పందిస్తారో.. ఇప్పటికైనా అఫీషియల్ అనౌన్సమెంట్ ఇస్తారో.. లేదంటే ఇంకా వెయిట్ చేయిస్తారో చూడాలి.

Pushpa2 regular shoot starts from Nov 3rd week at Bangkok

pushpa2
allu arjun
bangkok