ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 6: Nagarjuna fires on Geetu Royal

బిగ్ బాస్ 6: గీతు పై నాగార్జున ఫైర్

Bigg Boss 6: Nagarjuna fires on Geetu Royal

బిగ్ బాస్ సిక్స్ మొదలైనప్పటినుండి ప్రేక్షకుల సహనానికి, హౌస్ మేట్స్ సహనానికి పరిక్ష పెడుతున్న గీతు రాయల్ ని నాగార్జున కొద్ది వారాలుగా వెనకేసుకు రావడంతో ఆమె మరింతగా రెచ్చిపోతుంది. తానే ఒక నియంతలా, ఎంటెర్టైనెర్మెంట్ లో తానే తోపు అని, తనకన్నా ఎవరికీ ఏమి ఎక్కువ తెలియదని విర్రవీగుతున్న గీతు కి ఈ వారం టాస్క్ విషయంలో హౌస్ మేట్స్ మొత్తం ఎదురు తిరిగారు. ఫ్రెండ్ ఆది రెడ్డి కూడా గీతు నువ్వు కొన్ని తప్పుడు డెసిషన్స్ తీసుకుంటున్నావ్ అని కూడా చెప్పాడు. సంచాలక్ అయ్యి ఉండి టాస్క్ ఆడిన గీతుని అందరూ తప్పుబట్టారు. 

నేడు శనివారం ఎపిసోడ్ లో నాగార్జున గీతు పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. గీతుని అదిరెడ్డిని నించోబెట్టి క్లాస్ పీకారు. మొన్న జరిగిన చేపల వేట టాస్క్ లో నీ పార్ట్నర్ గీతు ఏం ఆడింది. ఫిజికల్ టాస్క్ ఇవ్వండి బిగ్ బాస్ గుద్దిపడేస్తాను అంది. గుద్దిపడేసినా అంది గీతు.. నిన్ను అడగలేదు గీతు అంటూ నాగ్ ఆగ్రహంతో అరిచారు. ఆడితే లీస్ట్ లో ఎందుకు ఉన్నారు అని అడిగారు నాగ్. నువ్వు అవతలి వాళ్ళ వీక్నెస్ మీద దెబ్బకొట్టి ఆడి గెలవాలనుకోవడం, ఎంతవరకు కరెక్ట్ అన్నారు నాగ్. 

నేనుండే సీజన్ లో వాళ్ళు ఆడకపోయినా నేనే ఆడిపిస్తాను అని చెప్పి అలా రెచ్చగొట్టాను అంది గీతు.. దానితో నాగార్జున నువ్వెవరివి నీ ఆట నువ్ ఆడు. అందరి ఆట చూడడానికి బిగ్ బాస్ ఉన్నాడు. సంచలాక్ ఓ ఎంపైర్. నీ ఆట బొచ్చులో ఆట.. అంటే నువ్ ఒప్పుకోవుగా.. నీవు సంచలక్ గా ఫెయిల్ అయ్యావు, నువ్ పనిష్మెంట్ తీసుకో అంటూ నాగర్జున గీతు ని తిట్టిన ప్రోమో చూసిన నెటిజెన్స్ అబ్బ గీతుకి ఎన్నాళ్ళకి క్లాస్ పడింది అంటూ హ్యాపీగా పండగ చేసుకుంటున్నారు.

Nagarjuna Fire Comments On Geetu Royal

nagarjuna
geetu royal
bigg boss telugu 6