విక్రమ్ సేఫ్: డాక్టర్స్ హెల్త్ బులిటెన్

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఛాతిలో నొప్పితో ఈ రోజు చెన్నై లోని కావేరి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని తెలిసినప్పటినుండి ఆయన ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. విక్రమ్ కి ఏమై ఉంటుంది.. ఒకపక్క కార్డియాక్ అరెస్ట్ అంటూ వార్తలొస్తున్నాయి అంటూ అభిమానుల్లో కలవరం మొదలయ్యింది. అయితే తాజాగా విక్రమ్ ని పర్యవేక్షిస్తున్న డాక్టర్స్ విక్రమ్ హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. విక్రమ్ ఛాతి నొప్పితో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయన ప్రస్తుతం డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారు. ఆయనకు ఎలాంటి కార్డియాక్ అరెస్ట్ జరగలేదు.
ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యంగానే ఉన్నారు.. అని వైద్యులు నిర్ధారించడమే కాదు, ఈ రోజు కానీ.. రేపు కానీ విక్రమ్ ని డిశ్చార్జ్ చేయనున్నట్టు డాక్టర్స్ ప్రకటించడంతో విక్రమ్ ఫాన్స్ కూల్ అయ్యారు. అయినప్పటికీ ఆయన త్వరగా కోలుకుని తిరిగిరావాలంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.
Hero Vikram Health bulletin
Vikram Safe: Doctors Health Bulletin






































