రామారావు ఆన్ డ్యూటీ కి రెండు డేట్స్
Ramarao On Duty To Release Either On March 25th Or On April 15thరవితేజ ఖిలాడీ మూవీ తో ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఆయన నెక్స్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇంతకూ ముందు ఈ సినిమాని మార్చి 25 న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
అయితే ఈ రోజు రామ రావు ఆన్ డ్యూటీ మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన విడుదల తేదీని మరోసారి ప్రకటించారు. రెండు డేట్లను మేకర్లు లాక్ చేశారు. మార్చి 25న లేదా ఏప్రిల్ 15న ఈ మూవీని విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. మా చిత్రంపై మాకు ప్రేమ అలానే ఇతర చిత్రాలపై అమితమైన గౌరవం కూడా ఉంది. మార్చి 25న రామారావు ఆన్ డ్యూటీ సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం. కానీ మారిన పరిస్థితులను బట్టి మా సినిమాను మార్చి 25న లేదా ఏప్రిల్ 15న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం అని నిర్మాతలు ప్రకటించారు.
Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri Ramarao On Duty To Release Either On March 25th Or On April 15th






































