ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mahesh Babu Brother Ramesh Babu Passes Away

మహేష్ బాబు సోదరుడు ఆకస్మిక మృతి

Mahesh Babu Brother Ramesh Babu Passes Away

మహేష్ బాబు సోదరుడు, కృష్ణ పెద్దకుమారుడు రమేష్ బాబు ఈరోజు శనివారం మృతి చెందారు. గత కొంత కాలంగా రమేష్ బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం నాడు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించటం తో కుటుంబ సభ్యులు ఆయన్ని ఏఐజీ ఆసుపత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తుంది. రమేష్ బాబు పాత తరం హీరో కృష్ణ పెద్ద కుమారుడు. నటుడిగా నీడ అనే సినిమాతో మొదలు పెట్టి, కొన్ని సినిమాలు చేసి ఆపేసారు. తరువాత నిర్మాత గా కూడా మారి అర్జున్ అనే సినిమా మహేష్ బాబు తో తీశారు. ఆ సినిమా నిర్మాతగా అంతగా డబ్బులు రాకపోయేసరికి నిర్మాత గా కూడా తప్పుకున్నారు. 

ఆ తరువాత రమేష్ బాబు చాలా కాలం ఇండస్ట్రీ కి దూరం గానే వున్నారు. గత కొంత కాలంగా లివర్ కి సంబంధించి వ్యాధితో బాధపడుతూ శనివారం కన్ను మూసారు. ప్రస్తుతం మహేష్ బాబు కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. దుబాయ్ నుండి తిరిగి వచ్చాక మహేష్ బాబుకి కరోనా పాజిటివ్ రాగా.. ఆ విషయాన్ని స్వయానా ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. ఇక రమేష్ బాబు మృతి చెందిన విషయం తెలియగానే అందరూ సినిమా ప్రముఖులు పలువురు రమేష్ మృతి పట్ల సంతాపాన్ని వెలిబుచ్చారు.

Ramesh Babu passes away

supertsra krishna son
ramesh babu
mahesh babu
ramesh babu passes away