రాజమౌళి ఎలాంటి టెంక్షన్ పడడం లేదు
Rajamouli does not feel any tensionరాజమౌళి ప్రస్తుతం.. తాను తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ ని సేఫ్ గా ల్యాండ్ చేసునేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ని ప్లాన్డ్ గా స్టార్ట్ చేసిన రాజమౌళి నిన్న గురువారం టాలీవుడ్ మీడియా ని పిలిచి జనని సోల్ ఆంథెమ్ ని చూపించడమే కాదు.. ఈ రోజు చెన్నైకి వెళ్లి అక్కడ మీడియా తో ఇంటరాక్ట్ అయ్యి.. ఆర్.ఆర్.ఆర్ సాంగ్ ని చూపించారు. అయితే రాజమౌళి నిన్న జనని సాంగ్ ప్రెస్ మీట్ లో డల్ గా ఉండడంతో.. ఆయన ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ విషయంలో ఒత్తిడికి లోనవుతున్నారని ఒకరు, కాదు ఏపీ టికెట్ రేట్స్ విషయంలో ఆయన మదనపడుతున్నారని మరొకరు ఇలా ఆయన కాస్త డల్ గా కనిపించడంపై రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో మొదలైపోయాయి.
అయితే తాజాగా రాజమౌళి ఎలాంటి ఒత్తిడి పడడం లేదు, అందులోనూ టెంక్షన్ అసలు తీసుకోవడం లేదు.. టాలీవుడ్ మీడియా మీట్ లో రాజమౌళి అలా డల్ గా ఉండడానికి కారణం ఆయన గత మూడు రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతుండడమే అని.. ఆయన ఇప్పుడు జ్వరంతో రెస్ట్ తీసుకుంటే.. ముందునుండి అనుకున్న ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కి ఆటంకం కలుగుతుంది కాబట్టే.. ఆయన ఈ ప్రెస్ మీట్స్ కి హాజరవుతున్నారని చెబుతున్నారు. ఫీవర్ వలనే నీరసంగా ఉన్నారు తప్ప.. ఎలాంటి టెంక్షన్ ఆయన తీసుకోవడం లేదని రాజమౌళి సన్నహితులు స్పష్టం చేస్తున్నారు.
Rajamouli RRR release on January 7th 2022







































